బాహుబలి తో ఎనలేని పేరు సొంతం అయినా కానీ తన స్టైల్ లోనే సినిమాలు చేస్తూ ఎప్పటి కప్పుడు డిఫెరెంట్ జానర్ లో మూవీస్ చేస్తూ వస్తున్న హీరో రానా దగ్గుబాటి, నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా నుండి వస్తున్న స్ట్రైట్ మూవీస్ అరణ్య మరియు విరాట పర్వం సినిమాలు సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా అందులో అరణ్య మూవీ ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో…
రూపొందిన సినిమా కాగా విరాట పర్వం తెలుగులో రూపొందింది, అరణ్య సినిమాను చాలా కాలం నుండి రూపొందిస్తూ వస్తు ఉండగా ఆల్ మోస్ట్ 60 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ను విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
26 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సడెన్ గా రిలీజ్ కి ముందు సినిమా రిలీజ్ ఆగిపోయింది, సౌత్ భాషల్లో రిలీజ్ అవుతున్నా కానీ అతి ముఖ్యమైన మార్కెట్ అయిన హిందీ మార్కెట్ లో సినిమా రిలీజ్ ను ఆపేశారు సినిమా నిర్మాతలు ఎరోస్ వాళ్ళు… దానికి కారణం కూడా ఉంది.
బాలీవుడ్ వాళ్ళు ఇంకా పాండమిక్ పరిస్థితుల నుండి తేరుకోలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా చాలా తక్కువ కలెక్షన్స్ నే అక్కడ సొంతం చేసుకుంటూ ఉండగా ఆ ఇంపాక్ట్ ఈ సినిమా పై కూడా పడే అవకాశం ఎంతైనా ఉండటం తో హిందీ రిలీజ్ ను హోల్డ్ లో పెట్టేసి సినిమా తెలుగు మరియు తమిళ్ వర్షన్ లను…
ఆడియన్స్ ముందుకు 26 న తీసుకు రాబోతున్నారు. ఇక హిందీ వర్షన్ ను పరిస్థితులు సద్దుకున్నాక గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని చెబుతున్నా అప్పటికి సినిమా అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అన్నది అనుమానమే… ఇక ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.