Home గాసిప్స్ 120 కోట్ల సినిమా…ప్రీ ప్రొడక్షన్ కే ఈ రేటు ఏంటి అసలు…ఏడాది నుండి ఏ సౌండ్...

120 కోట్ల సినిమా…ప్రీ ప్రొడక్షన్ కే ఈ రేటు ఏంటి అసలు…ఏడాది నుండి ఏ సౌండ్ లేదేంటి!

0

బాహుబలి టైం లో అంతే రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా రుద్రమదేవి. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కి కూడా భారీ హైప్ ఉన్నప్పటికీ టీసర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ కానీ కంటెంట్ కానీ అనుకున్న విధంగా లేక పోవడం తో మెల్లి మెల్లిగా హైప్ తగ్గింది, సినిమా రిలీజ్ అయ్యాక కూడా పెద్దగా టాక్ లేక పోవడం తో అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా.

రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ కొత్త సినిమాలు ఏవి చేయలేదు… కానీ ఈ సారి గట్టిగా కొట్టాలి అని మరో భారీ సినిమాను సిద్ధం చేయాలని సిద్ధం అయ్యాడు. ఆ సినిమా నే హిరణ్యకశిపుడు…. రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ మైతలాజికల్ మూవీ… రానా రీసెంట్ గా నటించిన అరణ్య భారీ ఫ్లాఫ్ గా నిలిచింది.

అయినా కానీ ఈ సినిమా పై ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్ తో ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా సినిమా ను రూపొంస్తున్నారట… ఏడాది క్రితం సినిమా ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందని తెలియజేశారు. కాగా సినిమా మొత్తం మీద 120 కోట్ల రేంజ్ బడ్జెట్ లో పాన్ ఇండియా లెవల్ లో…

ఈ సినిమాను రూపొందించబోతున్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తానికి ఏకంగా 15 కోట్ల రేటు అయ్యిందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఇది నిజంగానే భారీ బడ్జెట్ అనే చెప్పాలి. కానీ ఏడాది కావోస్తున్నా సినిమా పై ఎలాంటి అప్ డేట్ లేకపోయింది. ఈ గ్యాప్ లో గుణశేఖర్ ఇప్పుడు సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు..

సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేశారు లాంటివి అందరినీ ఆశగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. ముందు గుణశేఖర్ శాకుంతలం పూర్తీ చేసి తర్వాత ఈ సినిమా పనుల్లో ఉంటారని, ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమా త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుందని… అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు.. మరి ఈ సారి అయినా అనుకున్నట్లు వస్తారో లేదో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here