బాహుబలి తో పాన్ ఇండియా లెవల్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నా కానీ ఆ క్రేజ్ ని ఏ సినిమా పడితే ఆ సినిమా కి వాడుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న రానా దగ్గుబాటి సెలెక్టివ్ గా చేసిన సినిమాల్లో లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా అరణ్య. సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే…
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. మొదటి వీకెండ్ లో ఎలాగోలా లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ ఇప్పుడు…
బిగ్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచే విధంగా ఉందని చెప్పాలి. కాగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 60 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కోసం అల్టిమేట్ ఆఫర్ వచ్చింది అప్పట్లో… లీడింగ్ OTT ప్లాట్ ఫామ్స్ ఏకంగా 50 నుండి 55 కోట్ల రేంజ్ లో రేటు…
ఆఫర్ దక్కగా టీం మాత్రం ఆ ఆఫర్ కి నో చెప్పి సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే సినిమా కి భారీ ఎదురుదెబ్బ కొట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు. సినిమా కి బిజినెస్ కూడా జరగలేదు. ఎలాగోలా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 45 కోట్లు వచ్చినా కానీ….
మొత్తం మీద మిగిలిన మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర సగం కూడా రికవరీ అవ్వలేదు. అలా కాకుండా సినిమా డైరెక్ట్ రిలీజ్ ఆఫర్ 55 కోట్ల ఆఫర్ ను ఒప్పుకుని శాటిలైట్ రైట్స్ కి ఎంతో కొంత రేటు కి అమ్మి ఉంటె కచ్చితంగా 60 కోట్ల బడ్జెట్ మీద మంచి లాభాలు వచ్చేవి. కానీ అలా చేయకపోవడం తో ఇప్పుడు ఎరోస్ వాళ్ళకి భారీ నష్టాలు ఈ సినిమా వల్ల దక్కాయి అని చెప్పొచ్చు.