ఛలో సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మరో హిట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నాగశౌర్య(Naga Shaurya) నటించిన లేటెస్ట్ మూవీ రంగబలి(RangaBali) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో నోటబుల్ మూవీ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా నాగశౌర్య ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
ఊర్లో అందరి దృష్టిలో పడటానికి ఆకతాయి పనులు చేసే హీరో తన మెడికల్ షాప్ ని చూసుకుంటే చాలు అనుకునే తండ్రి కోసం వైజాగ్ వెళతాడు, అక్కడ హీరోయిన్ ని చూసి ఇష్టపడగా తర్వాత వీళ్ళ ప్రేమకి రంగబలి అనే సెంటర్ అడ్డుగా నిలుస్తుంది. ఆ అడ్డుని హీరో దాటాడా లేదా అన్నది సినిమా మిగిలిన కథ…
చాలా సింపుల్ స్టొరీ పాయింట్ తో వచ్చిన రంగబలి సినిమా ఫస్టాఫ్ వరకు సత్య కామెడీ సీన్స్ తో కథలో ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా ఎంటర్ టైన్ మెంట్ పరంగా బాగానే మెప్పిస్తుంది.. దాంతో కథ ప్రీ ఇంటర్వెల్ నుండి స్టార్ట్ అవుతుంది… ఇక సెకెండ్ ఆఫ్ కూడా ఇదే విధంగా ఉంటే నాగశౌర్య ఇక ట్రాక్ ఎక్కినట్లే అనుకున్నా…
సెకెండ్ ఆఫ్ కథ ఎటు నుండో ఏటో వెళుతూ కంప్లీట్ గా ట్రాక్ తప్పి సహనానికి పరీక్ష పెడుతుంది… నాగశౌర్య మరోసారి తన నటనతో పెర్ఫార్మెన్స్ తో మెప్పించగా హీరోయిజం సీన్స్ కూడా కొన్ని బాగున్నాయి. హీరో ఎలా మెప్పించాడో సత్య తన కామెడీతో అదే విధంగా మెప్పించడం విశేషం. ఈ రోల్ పై ఇంకా కామెడీ పుట్టించే అవకాశం ఉన్నప్పటికీ…
ఒక దశ తర్వాత ఈ రోల్ సైడ్ చేశారు… ఇక హీరోయిన్ ఓకే అనిపించేలా నటించగా విలన్ రోల్ కూడా జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది, సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పింది…
సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఫస్టాఫ్ ను డీల్ చేసినట్లు సెకెండ్ ఆఫ్ ను కూడా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ వే లోనే చెప్పి ఉంటే సినిమా బాగా మెప్పించి ఉండేది. కానీ ఫస్టాఫ్ కామెడీ వలన మొత్తం మీద సినిమా….
జస్ట్ ఓకే అనిపించేలా ముగుస్తుంది…సెకెండ్ ఆఫ్ ను కూడా కామెడీతోనే నడిపి ఉంటే బాగుండేది, కానీ సెన్స్ లెస్ సీన్స్ తో సెంటి మెంట్ సీన్స్ తో నింపి సినిమా ట్రాక్ తప్పింది అని చెప్పాలి. మొత్తం మీద ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ ఫస్టాఫ్ ను ఎంజాయ్ చేసినా సెకెండ్ ఆఫ్….
ట్రాక్ తప్పడంతో ఓపికతో చూస్తె మొత్తం మీద ఒకసారి చూడొచ్చు అనిపించేలా ముగుస్తుంది.. కానీ సినిమా ఎండ్ అయిన తర్వాత ఆడియన్స్ ముందే చెప్పినట్లు ఫస్టాఫ్ రేంజ్ లోనే సెకెండ్ ఆఫ్ ఉంటే బాగుణ్ణు అనుకోవడం ఖాయం. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….