Home న్యూస్ 86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో గీత గోవిందం..రంగస్థలం అవుట్!

86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో గీత గోవిందం..రంగస్థలం అవుట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు….చిన్న సినిమాగా రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం ఏకంగా 86 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ లెక్కలో ఏకంగా రంగస్థలంని కూడా మించిపోయింది.

సినిమా ఎంత కలెక్ట్ చేసినా ఆ సినిమాను కొన్న రేటుకి ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అన్నదే అసలు పాయింట్..ఆ విషయంలో బాహుబలి ని అందుకోవడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత రంగస్థలం 80 కోట్ల బిజినెస్ కి ఏకంగా 127.5 కోట్ల షేర్ తో 47.5 కోట్ల లాభాన్ని దక్కించుకుని చరిత్రకెక్కింది.

ఇప్పుడు ఆ రికార్డ్ ను గీత గోవిందం బ్రేక్ చేసింది….15 కోట్ల బిజినెస్ కి 26 రోజుల్లోనే 66 కోట్లకు పైగా షేర్ తో ఏకంగా 51 కోట్లకు పైగా లాభాన్ని దక్కించుకుని 86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే బిజినెస్ కి ఎన్నో రెట్లు వసూళ్లు సాధించి ఏకంగా బాహుబలి తర్వాత ప్లేస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here