మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా ఆడియన్స్ అంచనాలను అనుకున్న రేంజ్ లో అందు కోలేక పోయింది. అయినా కానీ ఓవరాల్ గా రవితేజ పెర్ఫార్మెన్స్ వరకు అయితే ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం కష్ట పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
కాగా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ లో ఇప్పుడు డిజిటల్ రైట్స్ బిజినెస్ న్యూస్ బయటికి వచ్చింది, ఆ న్యూస్ ప్రకారం సినిమా డిజిటల్ రైట్స్ తెలుగు వర్షన్ కి గాను సాలిడ్ రేటునే సొంతం చేసుకుందని చెప్పాలి. కేవలం తెలుగు వర్షన్ కి గాను ఆల్ మోస్ట్ సినిమా…
12.50 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుందని అంటున్నారు. సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా ఉండగా ఆ రేటు వివరాలు ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది. మొత్తం మీద సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు దక్కించుకోగా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యాక…
5-6 వారాల గ్యాప్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజకి రావణాసుర సినిమా నిరాశ పరిచే రిజల్ట్ ను ఇచ్చింది. ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.