మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు బాక్ టు బాక్ డిసాస్టర్ల తర్వాత కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారలను ఘనంగా కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తుంది, సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో రిపబ్లిక్ డే హాలిడే తర్వాత కొంచం స్లో డౌన్ అయింది కానీ స్టడీ కలెక్షన్స్ నే సాధిస్తూ దూసుకు పోతుంది.
మిగిలిన సంక్రాంతి సినిమాలు ఆల్ మోస్ట్ పరుగును పూర్తీ చేసుకునే స్టేజ్ లో ఉండగా క్రాక్ మాత్రం స్ట్రాంగ్ కలెక్షన్స్ ని ఇంకా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 21 వ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ తో 20 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.
సినిమా 21వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ షేర్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 5L
👉Ceeded: 3L
👉UA: 2.6L
👉East: 2.1L
👉West: 1.7L
👉Guntur: 2.1L
👉Krishna: 2.2L
👉Nellore: 1.6L
AP-TG Total:- 0.20CR (0.34Cr Gross~)
ఇదీ సినిమా 21 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేసిన కలెక్షన్స్, అన్ని సెంటర్స్ లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద మూడు వారాలు పూర్తీ అయ్యే టైం కి సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 11.48Cr
👉Ceeded: 5.86Cr
👉UA: 4.03Cr
👉East: 3.13Cr
👉West: 2.33Cr
👉Guntur: 2.63Cr
👉Krishna: 2.25Cr
👉Nellore: 1.70Cr
AP-TG Total:- 33.41CR (55.84Cr Gross~)
KA+ROI: 1.62Cr(Updated)
OS: 75L (Updated)
Total: 35.79Cr(59.80Cr~ Gross) (Updated)
ఇవీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 21 రోజుల తర్వాత సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. మొత్తం మీద 36 కోట్ల షేర్ మార్క్ కి చేరువ అవుతున్న సినిమా కెరీర్ బెస్ట్ రికార్డులను సొంతం చేసుకుని రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది.
ఇక సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ 17.5 కోట్లు కాగా సినిమా మూడు వారల తర్వాత 35.79 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ ప్రాఫిట్ లెక్క ఇప్పుడు 18.29 కోట్ల మార్క్ ని అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక నాలుగో వీక్ లో మొదటి రోజు ఆదివారం కాబట్టి మరోసారి స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవచ్చు.