మాస్ మహారాజ్ రవితేజ ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హాపెన్నింగ్ హీరో… ఏడాదికి మూడు నాలుగు సినిమాలు మినిమం రిలీజ్ చేస్తూ అందులో రెండుకి తగ్గని విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకోగా తర్వాత ఫాం కోల్పోగా… రాజా ది గ్రేట్ తో కంబ్యాక్ ఇచ్చినప్పటికీ తర్వాత మాత్రం ఒకటికి మించి ఒకటి ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకుంటూ 4 ఫ్లాఫ్స్ ని దక్కించుకున్నాడు.
ఈ ఏడాది కొంచం బెటర్ అంచనాల నడుమ వాచ్చిన డిస్కోరాజా అంచనాలు పూర్తిగా తప్పి డిసాస్టర్ అవ్వగా రవితేజ కి ఇది వరకు ఫ్లాఫ్స్ లో ఉన్నప్పుడు బలుపు మరియు డాన్ శీను సినిమాలతో మంచి హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఇప్పుడు క్రాక్ మూవీ చేస్తుండగా…
మరో 15 రోజుల షూటింగ్ మాత్రమె బాలెన్స్ ఉన్న ఈ సినిమా కి సుమారు 30 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అవ్వగా కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్ ఆగిపోయింది. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కానీ ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసేలా..
లేకపోవడం తో డైరెక్ట్ రిలీజ్ కి అన్ని సినిమాలకు మంచి ఆఫర్స్ దక్కుతుండగా క్రాక్ కి కూడా ఆఫర్స్ వస్తున్నాయట కానీ అది సినిమా బడ్జెట్ దృశ్యా తక్కువే అని అంటున్నారు. రవితేజ ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ వలన సినిమా కి సుమారు 22 కోట్ల రేంజ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ దక్కుతున్నాయని ట్రేడ్ లో వార్తలు వస్తున్నాయి.
ఈ రేటు తక్కువ గా ఉండటం అలాగే సినిమా షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉండటం, ఔట్ పుట్ పై నమ్మకంతో టీం సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఓపెన్ గానే చెబుతున్నారు… కానీ పరిస్థితి ఇయర్ ఎండ్ కి కూడా సెట్ కాకపొతే అప్పటికి మరిన్ని సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధపడతాయి అంటున్నారు.