మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ సరైన సినిమా అయితే పడటం లేదు, అలా పడిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉండగా తర్వాత మళ్ళీ వెంటనే వరుస ఫ్లాఫ్స్ తో రవితేజ మార్కెట్ పై ఇంపాక్ట్ పడుతుంది…క్రాక్ మూవీ తో సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత…
బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడిన తర్వాత తిరిగి ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టినా తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నాడు రవితేజ… ఇక లేటెస్ట్ గా ఈగల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజకి మరోసారి నిరాశ కలిగించే రిజల్ట్ సొంతం అయ్యింది. కొంచం మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ బాగుండేది…
ఓవరాల్ గా రవితేజ ప్రస్తుతం ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా తను రీసెంట్ గా నటించిన లాస్ట్ 5 సినిమా టోటల్ షేర్ లెక్క 100 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఒకసారి తన రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ను గమనిస్తే…
#Raviteja Last 5 Movies Box office Collections
👉#Eagle – 16.89CR*****
👉#TigerNageswaraRao – 25.50CR
👉#Ravanasura – 12.02CR
👉#Dhamaka – 45.06CR
👉#RamaraoOnDuty – 5.20CR
Total Last 5 Movies collections: 104.67CR
Average 1 Movie Collections: 20.93CR
వరుస ఫ్లాఫ్స్ పడ్డా కూడా లాస్ట్ 5 సినిమాల యావరేజ్ షేర్ 100 కోట్లు క్రాస్ చేయగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి 20.93 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది ఇప్పుడు. మంచి సినిమాతో మంచి రిలీజ్ డేట్ ని చూసుకుని ఆడియన్స్ ముందుకు వస్తే రవితేజ కి సాలిడ్ హిట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.