టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కోలివుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో మొదలైన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం లో ఈ సినిమా కి అనుకోని అవరోధం గట్టిగా ఎదురు అయింది ఇప్పుడు. దానికి కారణం డైరెక్టర్ శంకర్ ఇది వరకు కమిట్ అయిన మూవీ ని కంప్లీట్ చేయక పోవడమే అని అంటున్నారు.
శంకర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఇండియన్ సినిమా సీక్వెల్ గా ఇండియన్ 2 ని పాన్ ఇండియా లెవల్ లో మొదలు పెట్టగా ఈ సినిమా కి నిర్మాతలుగా లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఏకంగా 230 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని పెట్టడానికి…
ముందుకు రాగా సినిమా ఎప్పటి నుండో షూటింగ్ ని జరుపుకుంటూ వస్తుండగా ఎప్పటికప్పుడు ఎదో ఒక అవరోధం ఎదురు అవుతూ ఉండగా సినిమాను ఇక ఆపేసి… శంకర్ తన కొత్త సినిమాను రామ్ చరణ్ తో దిల్ రాజు బ్యానర్ లో మొదలు పెట్టాడు..
కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలు అవుతుందని చెప్పగా, మరి శంకర్ కమల్ ల కాంబోలో ఇండియన్ 2 పరిస్థితి ఏంటి…సినిమా పూర్తీ అవుతుందా లేదా అన్న డౌట్స్ ఉండగా సినిమా ఇక ఆగిపోయినట్లే అంటూ వార్తలు రాగా రీసెంట్ గా సినిమా నిర్మాతలు లైకా వాళ్ళు మద్రాస్ కోర్టులో కేసు వేశారు. శంకర్ 230 కోట్ల బడ్జెట్ కి ఆల్ మోస్ట్ 180 కోట్ల బడ్జెట్ పెట్టించిన తర్వాత సినిమాను ఆపాడని…
ఈ సినిమా పూర్తీ చేయకుండా కొత్త సినిమాను కమిట్ అయ్యాడని, ఆ సినిమాను ఆపేసి ముందు ఈ సినిమాను పూర్తీ చేయాలని మిగిలిన 50 కోట్ల బాలెన్స్ బడ్జెట్ ను పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు శంకర్ ఎలా రియాక్ట్ అవుతారు. ఆ సినిమాను పూర్తీ చేశాకే రామ్ చరణ్ తో మూవీని మొదలు పెడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉండి..