బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో మొత్తం మీద 4 సినిమాలు పోటిగా నిలవగా థియేటర్స్ సమస్య ముందే ఊహించి బాక్స్ ఆఫీస్ దగ్గర ముందే రిలీజ్ అయిన రవితేజ క్రాక్ సినిమా సోలో రిలీజ్ ను రికార్డ్ లెవల్ లో సొంతం చేసుకున్నా తర్వాత కొత్త సినిమాల వలన థియేటర్స్ ను కోల్పోవాల్సి వచ్చింది, మాస్టర్ రిలీజ్ రోజున కొన్ని థియేటర్స్ ను కోల్పోయిన క్రాక్ ఇప్పుడు రెడ్ అండ్ అల్లుడు అదుర్స్ సినిమాల వలన మరిన్ని థియేటర్స్ ని కోల్పోయింది.
మొత్తం మీద జనవరి 14 న థియేటర్స్ లో ఉన్న అన్ని సినిమాల థియేటర్స్ కౌంట్ ని ఒకసారి గమనిస్తే… ముందుగా కొత్తగా రిలీజ్ అయిన రామ్ రెడ్ మూవీ కి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 559 థియేటర్స్ కౌంట్ దక్కింది… అన్ని సినిమాల్లో ఇదే హైయెస్ట్ అని చెప్పాలి.
ఇక మరో కొత్త సినిమా అయిన బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సడెన్ ఎంట్రీ ఇచ్చినా కానీ మంచి థియేటర్స్ కౌంట్ నే సొంతం చేసుకుంది. సినిమా కి మొత్తం మీద 365 థియేటర్స్ వరకు పోటి లో దక్కడం విశేషం… ఇక పోటి లో ముందు వచ్చిన రవితేజ క్రాక్ మూవీ…
థియేటర్స్ కౌంట్ పై రీసెంట్ గా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. థియేటర్స్ ఇవ్వడం లేదని డిస్ట్రిబ్యూటర్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వగా మిగిలిన సినిమాల పోటి లో ఈ రోజు క్రాక్ కి మంచి థియేటర్స్ కౌంట్ దక్కింది, టాక్ పాజిటివ్ గా ఉండటం తో జనాలు వస్తుండటం తో థియేటర్స్ కచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద సినిమా కి 335 థియేటర్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో దక్కాయి.
ఇక రిలీజ్ అవ్వడమే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రిలీజ్ అయినా రెండో రోజు మాస్టర్ సినిమాకి ఇక్కడ థియేటర్స్ భారీగా తగ్గాయి. 247 థియేటర్స్ లో రెండో రోజు ని కొనసాగిస్తుంది ఈ సినిమా… మొదటి రోజు తో పోల్చితే సగానికి పైగా థియేటర్స్ ఈ సినిమా కి తగ్గాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…