Home న్యూస్ వకీల్ సాబ్ టీసర్ రివ్యూ…పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!

వకీల్ సాబ్ టీసర్ రివ్యూ…పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!

918
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వలాని డిసైడ్ అయిన తర్వాత మొదలు పెట్టిన మొదటి సినిమా వకీల్ సాబ్ భారీ అంచనాలను మోస్తూ గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా వలన కుదరలేదు. ఇక సంక్రాంతికి అనుకున్నా మిస్ అయిన ఈ సినిమా ఇప్పుడు సమ్మర్ రేసులో నిలవగా సినిమా అఫీషియల్ టీసర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ టీసర్…

ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఉందని చెప్పాలి. సినిమా పింక్ సినిమా కి రీమేక్ అయినా కానీ తెలుగు కి వచ్చే సరికి కంప్లీట్ కాన్సెప్ట్ నే మార్చేశారనిపిస్తుంది… ఆ మాస్ ఎలివేషన్ లు, పవర్ స్టార్ లుక్స్, ఎబ్బో టీసర్ మొత్తం ఒక కమర్షియల్ మూవీ నా అనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి.

ఇక పవర్ స్టార్ చెప్పిన పంచ్ డైలాగ్ కూడా అదిరిపోయే విధంగా ఉండగా మొత్తం మీద టీసర్ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసే రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి. ఇక టీసర్ లో తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో హైలెట్ అని చెప్పాలి. పవర్ స్టార్ తో తొలిసారి వర్క్ చేస్తున్న…

తమన్ ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు. కథ పాయింట్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే.. కానీ తెలుగు కి వచ్చే సరికి కంప్లీట్ కమర్షియల్ మూవీ గా మారిపోయింది వకీల్ సాబ్ సినిమా… వేణు శ్రీ రామ్ మళ్ళీ వింటేజ్ పవర్ స్టార్ ని ఈ సినిమా లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్ టెండెడ్ క్యామియో టైప్ రోల్ ని మెయిన్ స్ట్రీమ్ రోల్ లా మార్చేశారు.

మొత్తం మీద టీసర్ అంచనాలను అందుకోవడమే కాదు మించి పోయే రేంజ్ లో మెప్పించింది అని చెప్పొచ్చు. ఇక యూట్యూబ్ లో తొలి 24 గంటల్లో మెంటల్ అనిపించే రికార్డులను నమోదు చేయాలి అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరి ఫ్యాన్స్ లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. టీసర్ మట్టుకు పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ విత్ ది బ్యాంగ్ అనిపించే రేంజ్ లో ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here