వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్… భారీ అంచనాల నడుమ భారీ అవరోధాల నడుమ సినిమా ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తప్పితే మిగిలిన అన్ని చోట్లా నేడు రిలీజ్ అయ్యింది, ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది.
కథ పాయింట్ చాలా సింపుల్.. 1989 ఎలేక్షన్స్ ఓడిపోయినా ఎన్టీఆర్ ని ఫ్యామిలీ అండ్ కార్యకర్తలు వీడిపోగా తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది అసలు కథ అని అంటున్నారు.
కథ పాయింట్ ని జస్టి ఫై చేస్తూ రామ్ గోపాల్ వర్మ మొదటి అర్ధభాగం కథ లో కి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడని, చాలా సన్నివేశాల్లో తన మార్క్ స్లో మోషన్ అండ్ లాగింగ్ కెమరా యాంగిల్స్ తో కొంత విసుగు తెప్పించినా ఫస్టాఫ్ తో మంచి మార్కులే సొంతం చేసుకున్నాడట.
ఇక సెకెండ్ ఆఫ్ లో అసలు కథ ఉంటుందని, కొన్ని కీలక సన్నివేశాలు సెకెండ్ ఆఫ్ లో ఉండటం తో ఆ సన్నివేశాల కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ని సాటిస్ ఫై చేసే విధంగా రామ్ గోపాల్ వర్మ టేకింగ్ తో ఆ సీన్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు.
మొత్తం మీద కొన్ని మైనస్ పాయింట్స్ ని పక్కకు పెడితే సినిమా ఒకసారి చూసే విధంగా ఉందని ఓవర్సీస్ ఆడియన్స్ అంటున్నారు, ఫైనల్ టాక్ మాత్రం యావరేజ్ టు ఎబో యావరేజ్ గా చెబుతున్నారు. ఇక కామన్ ఆడియన్స్ నుండి సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.