రక్త చరిత్ర తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాల్లో ఏదైనా విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది అంటే అది కచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనే చెప్పాలి. ముందు ఎన్టీఆర్ బయోపిక్ కి రామ్ గోపాల్ వర్మ కి డైరెక్టర్ అనుకోవడం తర్వాత ప్రాజెక్ట్ మిస్ అవ్వడం తో ఈ సినిమా ను మొదలు పెట్టిన రామ్ గోపాల్ వర్మ నిజాలు మాత్రమె చెబుతాను అంటూ సంచలన కథనాలను ట్రైలర్ లో చూపాడు.
1989 లో రాజకీయాల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ ని అందరు ఒంటరి చేయడం, తర్వాత ఆయన జీవితం లో లక్ష్మీ పార్వతి ఎంటర్ అవ్వడం తో చోటు చేసుకున్న మార్పులు, తర్వాత కుటుంబం లో ఏర్పడిన మనస్పర్ధలు, తర్వాత ఏకంగా పార్టీ చేతులు మారడం..
నేటితరం యువత తెలిసీ తెలియని విషయాలన్నీ పూసగుచ్చి నట్లు సినిమా చూపబోతున్నామని ట్రైలర్ లో సగం చూపి అందరికీ షాక్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఇదంతా లక్ష్మీ పార్వతి దృష్టికోణం లో ఉండే కథ అని ముందే చెప్పి అసలు నిజాలు ఇవీ అంటూ ట్రైలర్ మొత్తం షాకింగ్ కథనాలను చూపాడు..
ట్రైలర్ లో ఉన్న కాంట్రవర్సీ అంశాలు పక్కకు పెడితే ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఇప్పటికే యూట్యూబ్ లో ట్రైలర్ రియల్ టైం వ్యూస్ 1 మిలియన్ ని అందుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, దాంతో యునానిమాస్ పాజిటివ్ రెస్పాన్స్ ని ట్రైలర్ సొంతం చేసుకుంది.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ మాత్రం భీభత్సంగా ఉండే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది, రక్తచరిత్ర తర్వాత మళ్ళీ ఈ సినిమా తో రామ్ గోపాల్ వర్మ అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చే లా కనిపిస్తున్నాడు. మీరు ట్రైలర్ చూసి ఎలా ఉందొ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.