RRR కథ లీకైంది!…నిజం అయితే ఊచకోతే!

0
1375

     వరుస విజయాలతో యమ జోరు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టి తర్వాత ఫ్లాఫ్ టాక్ తో హైయెస్ట్ షేర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో టాలీవుడ్ ఆల్ టైం నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆల్ టైం బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ RRR.. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా పై…

ఇప్పటి నుండే స్కై హై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా కి సంభందించిన కథ పాయింట్ ఎలా ఉంటుంది అన్నది మొదటి నుండి అందరి లోను ఆసక్తి ని రేపుతున్న ప్రశ్న అనే చెప్పాలి.

కాగా ఈ ఆసక్తి తో రోజు కో కథ రిలీజ్ అవుతూ వస్తుండగా రీసెంట్ గా మరో కొత్త కథ లీక్ అయిందని అంటున్నారు, ఆ కథ పాయింట్ వింటే ఇది నిజం అయినా మినిమం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనే ఫీలింగ్ అందరి లోను కలుగుతుంది. కథ పాయింట్ ఏంటి అంటే…

సినిమా లో మొదటి అర్ధభాగం 1940 కాలంలో ఉండగా ఆ టైం లో రామ్ చరణ్ పోలిస్ గా అలాగే ఎన్టీఆర్ దొంగగా ఉండగా మొదట్లో దొంగా పోలిస్ ల పోరాటం ఉన్నా తర్వాత స్వాతంత్ర్య పోరాటంలో ఇద్దరు కలిసి పోరాడి ప్రాణాలు అర్పిస్తారట. మళ్ళీ వాళ్ళే…

తిరిగి పుట్టి ఈ సారి ఎన్టీఆర్ పోలిస్ గాను రామ్ చరణ్ దొంగ గాను కనిపిస్తారని, ఇద్దరినీ కలపడానికి 1940 లో పోరాటంలో బ్రతికి ఉన్న మరో వ్యక్తీ సహాయం చేస్తాడని అంటున్నారు. ఓవరాల్ గా పాయింట్ కొంచం తెలిసినట్లే ఉన్నా…ఇద్దరు హీరోలకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా సమానమైన హీరోయిజం చూపుకునే కథ గా ఇది ఉందని చెప్పొచ్చు. మీరేమంటారు?? న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here