రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ వేవ్ లో తనకి తోచిన విధంగా తీసిన సినిమాల్లో ఎక్కువ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న సినిమాగా పవర్ స్టార్ సినిమా నిలుస్తుంది అని చెప్పాలి. కేవలం 10 లక్షల లోపు బడ్జెట్ లోనే తెరకెక్కిన ఈ సినిమా ను కాంట్రవర్సీ టీసర్లు కట్ చేసి కావల సినంత పబ్లిసిటీ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ టెలివిజన్ ఛానెల్స్ లో ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్నాడు.
దాంతో రామ్ గోపాల్ వర్మ ఇది వరకు తీసిన చెత్త గురించి తెలిసినా కానీ ఎదో కాంట్రవర్సీ చేసి ఉంటాడు అనుకుని ఈ 37 నిమిషాల సినిమా కాని సినిమాను విరగబడి చూశారు జనాలు. ట్రేడ్ లెక్కలు పూర్తిగా రివీల్ అవ్వగా సినిమా కి సాలిడ్ గా ప్రాఫిట్స్ దక్కాయని సమచారం.
మొదటి రోజు 150 టికెట్ రేటు, తర్వాత 250 రేటు అని పెట్టిన రామ్ గోపాల్ వర్మ చేసిన పబ్లిసిటీ తో ఫస్ట్ డే సినిమాను 1 లక్షా 20 వేల మంది దాకా చూడగా తర్వాత ఓవరాల్ గా ఇప్పటి వరకు 55 వేలకు అటూ ఇటూ గా టికెట్ కోని ఆన్ లైన్ లో చూశారట.
దాంతో టోటల్ టికెట్ సేల్స్ 1 లక్షా 80 వేలకి అటూ ఇటూ గా ఉండగా టికెట్ రేటు 150 వేసుకున్నా కానీ టోటల్ గా కలెక్షన్స్ 2.7 కోట్ల మార్క్ ని అందుకుంది. కొంచం అటూ ఇటూగా చూసుకున్నా ఈ సినిమా తో రామ్ గోపాల్ వర్మ 2.6 కోట్లు మినిమమ్ లో మినిమమ్ సంపాదించి ఉంటాడు అన్నది ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ ని ఎక్స్ పెర్ట్ చేయని వర్మ, ఇప్పుడు పవర్ స్టార్ సినిమా కి మరో రెండు మూడు సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం, ఈ మొదటి సినిమాలో కాంట్రవర్సీ కొన్ని పెట్టినా క్లైమాక్స్ లో భజన చేసి ఫ్యాన్స్ కోపాన్ని శాంతింప జేసిన వర్మ తర్వాత పార్టులలో ఏం చేస్తాడో మరి… ఫస్ట్ వేవ్ లో కానీ సెకెండ్ వేవ్ లో కానీ రామ్ గోపాల్ వర్మ తన స్టాటజీలు వాడి మంచి లాభాలు సొంతం చేసుకుంటున్నాడు…