బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న టాలీవుడ్ హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద ఆడియన్స్ లో మంచి బజ్ అయితే ఉండగా….
సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరు మీద జరుగుతూ ఉండగా మరో పక్క వరుస ఫ్లాఫ్స్ లో నితిన్ ఉన్నప్పటికీ కూడా బిజినెస్ పరంగా ఈ సినిమా సాలిడ్ రేట్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ రెడీ నైజాంలో వాల్యూ బిజినెస్ కింద…
10.50 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో కూడా బిజినెస్ ను లాక్ చేసుకుని కుమ్మేసింది. కోస్టల్ ఆంధ్రలో ఆల్ మోస్ట్ 11.50 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసిన సినిమా..
రాయలసీమ ఏరియాలో కూడా ఎక్స్ లెంట్ రేటుని దక్కించుకుంది. ఆల్ మోస్ట్ 3.5 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించడం విశేషం అని చెప్పాలి. వరుస ఫ్లాఫ్స్ తో ఉన్నా కూడా రాబిన్ హుడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….
ఎలాంటి రచ్చ చేస్తుందో తెలియదు కానీ బిజినెస్ పరంగా మాత్రం మాస్ కుమ్ముడు కుమ్ముతూ ఉండగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచనాలను కనుక అందుకుంటే కచ్చితంగా ఈ బిజినెస్ ను రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మరి సినిమాతో నితిన్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.