Home న్యూస్ ఇంత మంచి సినిమా… కానీ కలెక్షన్స్ మాత్రం మైండ్ బ్లాంక్ చేశాయి!

ఇంత మంచి సినిమా… కానీ కలెక్షన్స్ మాత్రం మైండ్ బ్లాంక్ చేశాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక నిరాశ పరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి కోవ లోకే వస్తుంది కోలివుడ్ సీనియర్ యాక్టర్ మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ రాకెట్రి ది నంబి ఎఫెక్ట్ మూవీ…. పోయిన వారం రిలీజ్ అయిన ఈ సినిమా కి మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అయినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపలేక పోయింది…

మొత్తం మీద 11 రోజులు పూర్తీ అయిన తర్వాత ఈ సినిమా హిందీ లో 9.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకుంది… ఇక తమిళనాడులో సినిమా 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. తెలుగులో చాలా లిమిటెడ్ రిలీజ్ అవ్వడంతో ఇక్కడ పెద్దగా జోరు చూపించలేక పోయింది.

టోటల్ గా సినిమా అన్ని వర్షన్ లు కలుపుకుని ఇండియాలో 20 కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఓవర్సీస్ కలెక్షన్స్ మరో 3.50 కోట్ల దాకా ఉంటాయని అంచనా… దాంతో ఇంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here