Home న్యూస్ RRR ప్రీమియర్ షో రివ్యూ….దంచికొట్టుడే ఇక!!

RRR ప్రీమియర్ షో రివ్యూ….దంచికొట్టుడే ఇక!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఎట్టకేలకు ఇప్పుడు అశేష ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, ఇండియా లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వగా ముందుగా స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుని ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది….

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ ఇద్దరు హీరోల అల్టిమేట్ ఇంట్రోలతో సినిమా స్టార్ట్ అవ్వగా ఇద్దరు హీరోల స్నేహం అలాగే బ్రిటీష్ వాళ్ళపై వీళ్ళు తిరగబడే సమయంలో ఏర్పడిన కొన్ని ఇంసిడెంట్ ల తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథగా చెప్పొచ్చు, అసలు సిసలు హైలెట్స్ అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ఫస్టాఫ్ వరకు కథ టేక్ అవ్వడానికి టైం పట్టినా ఇద్దరు హీరోల క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉన్న తర్వాత సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా ఆ అంచనాలకు తగ్గట్లు సెకెండ్ ఆఫ్ లో యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో…

గూస్ బంప్స్ ని తెప్పించేలా ఉంటుందని, ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్ టచ్ తో మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు, ఓవరాల్ గా లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం పట్టడం లాంటివి చిన్న మైనస్ పాయింట్స్ అయినా రాజమౌళి నుండి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు అద్బుతంగా జోడించి జక్కన్న….

RRR Movie Releasing 10000+ Theaters World Wide

ఫుల్ పాస్ మార్కులతో దుమ్ము లేపాడు అని చెబుతున్నారు, ఓవరాల్ గా సినిమా కి స్పెషల్ షోలు ప్రీమియర్ షోల తర్వాత హిట్ నుండి సూపర్ హిట్ రేంజ్ లో టాక్ వినిపిస్తుంది అని చెప్పాలి… ఇక ఇదే రేంజ్ టాక్ ని మొదటి రోజు మొత్తం కొనసాగించి పాజిటివ్ టాక్ కంటిన్యూ అయితే ఇక బాక్స్ ఆఫీస్ ను ఈ సినిమా దంచి కొట్టే రికార్డులతో దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here