Home న్యూస్ 5 నిమిషాల్లో ఇండియా… 8 నిమిషాల్లో వరల్డ్ వైడ్…ఫ్లాఫ్స్ పడ్డా బాలయ్య క్రేజ్ తగ్గలేదు!!

5 నిమిషాల్లో ఇండియా… 8 నిమిషాల్లో వరల్డ్ వైడ్…ఫ్లాఫ్స్ పడ్డా బాలయ్య క్రేజ్ తగ్గలేదు!!

0

     ఈ ఇయర్ మొదట్లో 2 అట్టర్ డిసాస్టర్ మూవీస్ తో అందరికీ షాక్ ఇచ్చాడు బాలయ్య.. సినిమాలకు మంచి రివ్యూ లు దక్కినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లేక ఆ సినిమాలు భారీ డిసాస్టర్లు గా మిగిలి పోయాయి. ఇలాంటి సమయం లో బాలయ్య అప్ కమింగ్ మూవీ కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా రీసెంట్ గా రిలీజ్ అయిన రూలర్ సినిమా టీసర్ సమాదానం ఇచ్చింది.

సినిమా టీసర్ లో ఒక్క బాలయ్య డిఫెరెంట్ గెటప్స్ పై నెగటివ్ ఫీడ్ బ్యాక్ పక్కకు పెడితే ఒక కమర్షియల్ మూవీ గా టీసర్ కి ఓవరాల్ రెస్పాన్స్ బాగానే దక్కింది, ఇక టీసర్ సోషల్ మీడియా లో బాగానే ట్రెండ్ అయ్యి దుమ్ము లేపి ఫ్లాఫ్స్ పడ్డా క్రేజ్ తగ్గలేదని నిరూపించింది.

సినిమా టీసర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో 15 వేలకి పైగా ట్వీట్స్ తో ఇండియా లో టాప్ 3 ప్లేసులో 5 నిమిషాలకే ట్రెండ్ కాగా నాన్ స్టాప్ గా ట్రెండ్ అయిన టీసర్ వరల్డ్ వైడ్ గా టాప్ 35 ప్లేసు లోపు ట్రెండ్ అయ్యింది 8 నిమిషాలలో. తర్వాత కూడా సినిమా ట్రెండ్ అవ్వగా…

ఓవరాల్ గా 40 వేల వరకు ట్వీట్స్ వివిధ హాష్ టాగ్స్ పై పోల్ అయ్యి దుమ్ము లేపాయి. దాంతో బాలయ్య కి సోషల్ మీడియా లో ఫ్లాఫ్స్ పడ్డా క్రేజ్ తగ్గలేదు అని చెప్పొచ్చు. ఇక సినిమా బిజినెస్ పరంగా కూడా రిలీజ్ కి ముందే రాయలసీమ ఏరియాలో 5.5 కోట్ల రేంజ్ బిజినెస్ ని దక్కించుకుంది.

ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ లు కూడా మెల్లి మెల్లి గా జోరు అందుకునే అవకాశం ఉండటం తో రిలీజ్ సమయానికి డీసెంట్ బిజినెస్ ని అందుకునే చాన్స్ పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇక టీసర్ తొలి 24 గంటలు పూర్తీ అయ్యే సరికి ఎన్ని మిలియన్స్ వ్యూస్ అండ్ ఎన్ని లక్షల లైక్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here