ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు జరగనిది ఇప్పుడు జరుగుతుంది, సినిమా వాళ్ళ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది కానీ అది కోపంగా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు అభిమానులు చూపెడుతున్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై స్పందించని బాలీవుడ్ సెలబ్రిటీలను ముఖ్యంగా స్టార్ కిడ్స్ మూవీస్ ని చీల్చి చెండాడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆలియా భట్ నటించిన సడక్ 2 సినిమా వంతు వచ్చింది.
టోటల్ అందరూ స్టార్ కిడ్స్, స్టార్స్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళతో నిండిపోయిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూనే ట్రైలర్ కి విపరీతమైన డిస్ లైక్స్ వెల్లువలా వస్తూనే ఉన్నాయి. సినిమా డైరెక్టర్ మహేష్ భట్ కి సుశాంత్ మృతికి సంబంధం ఉందీ….
అంటూ వస్తున్న వార్తలు, మహేష్ భట్ ని సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా గురువుగా భావించడం, ఇక ఆలియా భట్ సుశాంత్ పై ఒక షోలో కామెడీగా చేసిన కామెంట్స్ ఓవరాల్ గా ఇది నేపోటీజం ని అడుగడుగునా ప్రతీకగా నిలిస్తుండటం తో ఈ సినిమా పై ఎప్పటి నుండో వ్యతిరేకత ఉంది.
అది ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక పీక్స్ కి చేరింది, ఎంతలా అంటే ఇండియా లోనే ఇప్పటి వరకు ఏ ట్రైలర్ కి కూడా రానన్ని డిస్ లైక్స్ ఈ ట్రైలర్ కి వస్తున్నాయి. ఆల్ మోస్ట్ 10 మిలియన్స్ డిస్ లైక్స్ రేంజ్ లో ఉండటం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. యూనిట్ కూడా ఎం చేయాలనీ పరిస్థితి నెలకొంది.
జనాల కోపం తీవ్ర రూపం దాల్చడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ ఇప్పుడు తెలియాల్సింది అల్లా, ఇది కేవలం కొందరు స్టార్స్ కి మాత్రమే జరిగే పనా లేక సుశాంత్ పై స్పందించని ప్రతీ ఒక్కరికీ జరుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ ట్రైలర్ రానున్న టైం లో మరింత డిస్ లైక్స్ ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.