Home న్యూస్ RRR రికార్డ్ బ్రేక్ చేసిన సలార్ ట్రైలర్….కొత్త బెంచ్ మార్క్ ఇది!

RRR రికార్డ్ బ్రేక్ చేసిన సలార్ ట్రైలర్….కొత్త బెంచ్ మార్క్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెలలో రికార్డుల ఊచకోత కోయడానికి సిద్ధం అవుతున్న మమ్మోత్ పాన్ ఇండియా మూవీ సలార్(salaar part 1 – ceasefire) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నుండి వస్తున్న ఊరమాస్ మూవీ రీసెంట్ టైంలో ఇదే అవ్వడంతో స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ ఈ సినిమా మీద ఉన్నాయి.

ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో ఈ నెలలో తేలబోతుతుంది. ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ అయితే సినిమా మీద అంచనాలను నిజం చేస్తూ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

Salaar Trailer Breaks RRR Movie Trailer Record
ట్రైలర్ టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ ట్రైలర్ లైక్స్ రికార్డులను క్రియేట్ చేస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు ఏకంగా ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది, ఇది వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ల కాంబోలో…

RRR Movie 6 Days Total World Wide Collections!

ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆస్కార్ విన్నింగ్ మూవీ RRR సినిమా ట్రైలర్ 1 మిలియన్ లైక్స్ మార్క్ ని 7 గంటల 43 నిమిషాల టైం కి అందుకుని రికార్డ్ కొట్టింది, ఆ రికార్డ్ ను తర్వాత వచ్చే ఏ ట్రైలర్స్ అందుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చిన సలార్ ట్రైలర్ మాత్రం రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

యూట్యూబ్ లో 6 గంటల 04 నిమిషాల టైం మాత్రమే తీసుకుని RRR మూవీ ట్రైలర్ 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది, ఈ రికార్డ్ ను అప్ కమింగ్ ట్రైలర్స్ లో ఏ ట్రైలర్ బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక. ఇక సలార్ ట్రైలర్ ఓవరాల్ గా సినిమా మీద ఉన్న అంచనాలను పెంచేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here