Home న్యూస్ రాయలసీమలో గుంటూరు కారం బిజినెస్ ఆఫర్ ఎన్ని కోట్లో తెలుసా??

రాయలసీమలో గుంటూరు కారం బిజినెస్ ఆఫర్ ఎన్ని కోట్లో తెలుసా??

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 100 కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో దూసుకు పోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.

ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా బిగ్గెస్ట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాకి రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే భారీ ఎత్తున బిజినెస్ ఆఫర్స్ సొంతం అవుతూ ఉన్నాయి…

కాగా సినిమాకి అన్ని ఏరియాల నుండి భారీ ఆఫర్స్ వస్తూ ఉండగా రాయలసీమ ఏరియా నుండి కూడా ఇప్పుడు ఎక్స్ లెంట్ బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా కి ఈ ఏరియా లో 14-15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ సొంతం అవుతూ ఉన్నట్లు సమాచారం.

పక్కా మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి భారీ సినిమా అవ్వడంతో ఈ రేంజ్ రేటుని కూడా టాక్ బాగుంటే రికవరీని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రిలీజ్ దగ్గర పడే కొద్ది సినిమా అన్ని ఏరియాల సెన్సేషనల్ బిజినెస్ లెక్కలు క్లియర్ గా రివీల్ అవుతాయని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here