Home న్యూస్ సలార్ ట్రైలర్ రివ్యూ….రికార్డులు చెల్లాచెదురు ఖాయం ఇక!

సలార్ ట్రైలర్ రివ్యూ….రికార్డులు చెల్లాచెదురు ఖాయం ఇక!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మమ్మోత్ మూవీ అయిన సలార్(salaar part 1 – ceasefire) ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఎట్టకేలకు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను ఇప్పుడు…

రిలీజ్ చేశారు మేకర్స్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులతో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు, ఆ రేంజ్ లో సినిమా ట్రైలర్ మెప్పించగా ప్రభాస్ మాస్ ఎలివేషన్స్, ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రశాంత్ నీల్ ఎక్స్ లెంట్ టేకింగ్ తో…

ట్రైలర్ ప్రతీ సీన్ కూడా ఓ రేంజ్ లో మెప్పించడం విశేషం, సినిమా కథ పాయింట్ ని కూడా ట్రైలర్ లో కొద్దివరకు చెప్పినప్పటికీ కూడా మాస్ సీన్స్, గూస్ బంప్స్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేసింది అని చెప్పాలి…

ఇద్దరు స్నేహితులు, ఒకరికి సమస్య వస్తే నన్ను తలచుకో నేను నీ కోసం వస్తే అంటూ చెప్పిన ప్రభాస్, పృద్విరాజ్ కి వచ్చిన ఓ పెద్ద సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నది కథగా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది, ట్రైలర్ లో మొదటి 2 నిమిషాలు కథని చెప్పి తర్వాత ప్రభాస్ ఎంట్రీ పెట్టగా అక్కడ నుండి ట్రైలర్ ఓ రేంజ్ లో మెప్పించింది…

సినిమాలో కూడా ఇదే జరిగితే మట్టుకు ప్రభాస్ ఎంట్రీకి టైం పడుతుంది ఏమో అనిపిస్తుంది, ఓవరాల్ గా ట్రైలర్ అంచనాలను అందుకుని సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ ని పెంచేసింది, కొంచం కేజిఎఫ్ అలాగే ఉగ్రమ్ సినిమా ఛాయలు కనిపించాయి ట్రైలర్ లో… ఇక బాక్స్ అఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ లో ఊచకోత కోస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here