Home న్యూస్ యానిమల్ 1st డే కలెక్షన్స్….సెన్సేషనల్ ఊచకోత ఇది!!

యానిమల్ 1st డే కలెక్షన్స్….సెన్సేషనల్ ఊచకోత ఇది!!

0

రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మోస్ట్ హైప్ మూవీ అయిన యానిమల్(Animal Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, ఓపెనింగ్స్ అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేసేలా ఉండగా తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా…

మొదటి రోజు ఇప్పుడు రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండటం విశేషం, సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి ముందు రోజు గ్రాస్ బుకింగ్స్ తోనే 4.5 కోట్ల దాకా బుకింగ్స్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి ముందు రోజు 40 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను అందుకుంది. మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

12-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఇక హిందీతో కలిపి ఇండియాలో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మొదటి రోజు 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 60-65 కోట్ల గ్రాస్ ను అందుకోవచ్చు.

ఇక ఓవర్సీస్ లో సినిమా 4 మిలియన్ డాలర్స్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండటంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 105 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది…

బాలీవుడ్ సినిమాల పరంగా అతి కొద్ది సినిమాలు మాత్రమే మొదటి రోజు 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి, ఇప్పుడు యానిమల్ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొదటి రోజు సినిమా అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here