Home న్యూస్ ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ కి గొడవ…సలార్2 కాన్సిల్…..టీం ఏం చెప్పారో తెలుసా!!

ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ కి గొడవ…సలార్2 కాన్సిల్…..టీం ఏం చెప్పారో తెలుసా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రశాంత్ నీల్(Prashanth Neel) ల కాంబోలో రూపొందిన సలార్(Salaar part 1 – ceasefire) సినిమా టోటల్ రన్ లో 630 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపింది…ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ సాంగ్స్ లేకుండా సీరియస్ కథతోనే దుమ్ము లేపిన ఈ సినిమా…

సీక్వెల్ కి పెర్ఫెక్ట్ గా గ్రౌండ్ ని సెట్ చేయగా ఎప్పుడెప్పుడు పార్ట్ 2 మొదలు అవుతుందా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని వెబ్ సైట్స్ సినిమా మీద ఓపెన్ స్టేట్ మెంట్స్ ని వదిలారు…ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ కి మధ్య కొన్ని గొడవలు జరిగాయి అని…

అందుకే ప్రశాంత్ నీల్ సలార్ 2 ను ముందు మొదలు పెట్టాలి అనుకున్నా ఇప్పుడు ఎన్టీఆర్(JR NTR) తో సినిమాను ఆగస్టులో మొదలు పెట్టబోతున్నాడు అని అంటూ ఉండగా మొత్తానికే సలార్2 ని ఇప్పుడు కాన్సిల్ చేశారు అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో దీనిపై భారీగా చర్చలు జరిగాయి…

Salaar 5 Days Total WW Collections!

దాంతో ఈ వార్తలు మేకర్స్ దాకా వెళ్ళగా రీసెంట్ గా మేకర్స్ దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ వార్తలు విని ప్రభాస్ ప్రశాంత్ నీల్ లు నవ్వకుండా ఉండలేక పోయారు అంటూ సలార్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి కామెంట్ చేశారు. దాంతో సలార్2 మూవీ కాన్సిల్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయింది. 

ప్రస్తుతం ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ ల కమిట్ మెంట్స్ వలన సలార్2 మొదలు అవ్వడం కొంచం ఆలస్యం అవ్వొచ్చు కానీ సలార్2 మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉంటుంది అనేది కన్ఫాం చేశారు. పార్ట్ 1 కి మించి భారీ హైప్ ఉన్న పార్ట్ 2 లోనే అసలు సిసలు కథ ఉంది కాబట్టి పార్ట్ 2 ఎప్పుడు వచ్చినా అద్బుతాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

Salaar 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here