తన సినిమాలు ఫ్లాఫ్ అయితే ఎంతమంది హీరోలు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి సిద్ధం ఉంటారు చెప్పండి…ఎవరో కొందరు మాత్రమె ఇలా తమ సినిమాలు ఫ్లాఫ్ అయితే ఎంతోకొంత వెనక్కి ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా 35 కోట్లు వెనక్కి ఇచ్చి తనమనసు ఎంత పెద్దదో చెప్పకనే చెప్పాడు. సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్(kisi ka bhai kisi ki jaan) రంజాన్ కానుకగా….
రిలీజ్ అయ్యి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది. ఆ సినిమా రిజల్ట్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటించిన కొత్త సినిమా టైగర్ 3 పై కూడా పడే అవకాశం ఉండగా…..
కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ను ఇండియా లో మొత్తం మీద 100 కోట్ల రేంజ్ లో అమ్మారు… దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగి 110 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసి భారీగా నష్టాలను సొంతం చేసుకుంది.
రిలీజ్ కి ముందు అన్ని బిజినెస్ లు కలిపి 150 కోట్ల ప్రాఫిట్ రాగా ఈ భారీ నష్టాలు చూసి కొన్న బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు తమని ఆదుకోమని కోరగా సల్మాన్ సినిమా టోటల్ రన్ పూర్తి అయ్యాక వచ్చిన లాస్ లెక్క కట్టి నష్ట పరిహారం ఇస్తామని చెప్పగా…
ఎట్టకేలకు రీసెంట్ గా ఆ లెక్కలను అన్నీ చూసుకుని సుమారు 35 కోట్ల మేర అందరికీ వెనక్కి తిరిగి ఇచ్చేశారని సమాచారం. దాంతో సల్మాన్ మంచి పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. నిర్మాతగా సినిమాతో భారీ లాభాలు రాగా ఈ నష్టపరిహారం ఇచ్చేసినా కానీ సినిమా తో సల్మాన్ సాలిడ్ ప్రాఫిట్స్ ని దక్కించుకున్నాడని చెప్పొచ్చు. ఇక టైగర్ 3 దీపావళికి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతుంది.