బాలీవుడ్ వాళ్ళు ఓన్ కథలను తెరకెక్కించడం ఎప్పుడో మానేశారు, అడపాదడపా కొన్ని మంచి సినిమాలు వస్తున్నా కానీ చాలా వరకు మాత్రం రీమేక్ సినిమాలు లేదా తీసిన సినిమా కథలనే మళ్ళీ మళ్ళీ తీయడం లాంటివి చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరి కామెంట్ వీళ్ళు మారరు అని…
అవే రొటీన్ కథలు, అవే రొటీన్ ఫైట్స్, అవే రొటీన్ మూస మాస్ సినిమాలు, అనిపించే విధంగా ఉంది రాధే సినిమా ట్రైలర్… పోకిరి సీక్వెల్ అంటూ ప్రభుదేవా డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే అనేక సినిమాల్లో చూసిన కథ పాయింట్ తోనే వస్తుంది.
సిటీ లో డ్రగ్స్ వాడకం ఎక్కువ అవ్వడం, దాని వెనక ఒక విలన్ వాళ్ళని ఆపడానికి ఎవరున్నారు అంటే… ఒక క్రాక్ పోలిస్ వచ్చి అన్నీ నేను సెట్ చేస్తాను అంటూ చెప్పడం ఇదే రొటీన్ టెంప్లెట్ తో మరోసారి వస్తున్న సినిమా రాధే… బాలీవుడ్ లో క్వాలిటీ అద్బుతంగా ఉంటుంది అంటారు కానీ…
చాలా సినిమాల ప్రొడక్షన్ వాల్యూస్ నాసిరకంగా ఉంటూ వస్తున్నాయి. ఈ సినిమా విషయం లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా నాసిరకంగా అనిపించే విధంగా ఉందని చెప్పాలి. ఇక సినిమాలో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటి మార్ సాంగ్ ని యాసిటీస్ దింపేశారు… ట్రైలర్ మొత్తం రొటీన్ స్టఫ్ తోనే నిండిపోగా…
సల్మాన్ ఖాన్ లుక్స్ పరంగా యాక్షన్ పరంగా వాంటెడ్, దబాంగ్, ఏక్ థా టైగర్ లాంటి యాటిట్యూడ్ తోనే సరిపెట్టాడు…. మొత్తం మీద వాంటెడ్ సీక్వెల్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది అనుకుంటే ఫక్తు మాస్ మూవీ గానే ట్రైలర్ అనిపించింది. ఇక సినిమా మే 13 న థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కానుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.