బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలు ప్రతీ ఇయర్ రంజాన్ టైం లో ఆడియన్స్ ముందుకు రావడం అన్నది ఆనవాయితీ. దాదాపు 12 ఏళ్ళుగా ఒకటి రెండు సార్లు మినహా ప్రతీ రంజాన్ కి సల్మాన్ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ రంజాన్ కి ఆడియన్స్ ముందుకు రావాల్సిన పోకిరి సీక్వెల్ రాధే ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈ ఇయర్ రంజాన్ కి…
రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా, సడెన్ గా వచ్చిన సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ కి చేరుకోవడం తో అసలు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం తక్కువే అని ఇప్పుడు టాక్ వినిపిస్తుండగా సినిమాను మే 13 న అటు థియేటర్స్ లో ఇటు డిజిటల్ లో…
పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. కాగా ట్రైలర్ చూసిన వాళ్ళు అందరూ రొటీన్ రొట్ట కొట్టుడు ట్రైలర్ అని, ఎలాంటి కొత్తదనం లేని ట్రైలర్ అంటూ విమర్శలు గుప్పించారు. ఏమాత్రం కొత్తదనం లేకుండా రొటీన్ సినిమాలతో…
ఆడియన్స్ విసిగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు…ఇవేవి పట్టించుకోకుండా ఇప్పుడు సినిమా పే పెర్ వ్యూ టికెట్ రేటు ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారు. పే పెర్ వ్యూ పద్దతిలో ఈ సినిమా ని చూడాలి అంటే 299 రేటు పెట్టి కొనాల్సిందే అంటూ చెబుతున్నారు. థియేటర్స్ లో అయితే 100 నుండి రేట్లు థియేటర్స్ ని బట్టి…
పెరుగుతూ పోతాయి కానీ పే పెర్ వ్యూ అంటే ఒక టికెట్ పై ఇంట్లో వాళ్ళు అందరూ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రేటు అని అంటున్నారు. ఆ రేటు పెట్టిన ఇతర సినిమాలు వ్యూయర్ షిప్ లేక డిసాస్టర్ అయ్యాయి. మరి సల్మాన్ ఖాన్ మూవీ కి ఎన్ని టికెట్స్ తెగుతాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి…