తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 96 సినిమా ను తెలుగు లో డబ్ చేస్తారు అనుకున్నా భారీ రేటు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగు లో సమంత శర్వానంద్ ల కాంబినేషన్ లో జాను అంటూ ఈ సినిమా ను రూపొందించి రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి మంచి టాక్ వచ్చినా కానీ ఎక్కువ శాతం ఒరిజినల్ ని ముందే చూసి ఉండటం సినిమా కి ఎదురుదెబ్బ కొట్టింది.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ బిజినెస్ ని అందుకోలేక డిసాస్టర్ అయ్యింది. సినిమా ను ఏకంగా 18.5 కోట్లకు అమ్మగా 19.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా కేవలం 8.5 కోట్ల రేంజ్ షేర్ ని…
మాత్రమె వసూల్ చేసి 9.96 కోట్ల రేంజ్ లో నష్టాలను దక్కించుకుంది. కానీ సినిమా శాటిలైట్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు చెల్లించి స్టార్ మా సొంతం చేసుకోగా రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి టెలివిజన్ లో కూడా బిలో యావరేజ్ TRP రేటింగ్ దక్కింది.
ఫస్ట్ టైం టెలికాస్ట్ సమయం లో ఈ సినిమా 7.03 TRP రేటింగ్ మాత్రమె దక్కినట్లు సమాచారం… లాక్ డౌన్ టైం కొనసాగుతున్న టైం లో ఎప్పటివో పాత సినిమాలు శివ రామ రాజు 5.03 TRP రేటింగ్ ను, ప్రేమంటే ఇదేరా 4.3 వరకు TRP రేటింగ్ ని దక్కించుకోగా…. జాను సినిమా…రిలీజ్ అయ్యి నెల రోజుల సమయం లోనే…
టెలికాస్ట్ అయిన కానీ కేవలం 7.03 TRP రేటింగ్ తోనే సరిపెట్టుకుంది. ఈ సినిమా శర్వానంద్ ఖాతాలో రీసెంట్ టైం లో మరో డిసాస్టర్ యాడ్ అయినట్లు అయింది… సమంత కి కూడా రీసెంట్ టైం లో ఇదే భారీ డిసాస్టర్ అయిన సినిమా గా నిలిచింది. దాంతో అటు వెండితెర పై ఇటు బుల్లితెర పై కూడా డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది ఈ సినిమా…