రీసెంట్ టైంలో టాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయిన రీ రిలీజ్ ల ట్రెండ్ తర్వాత కోలివుడ్ లో కూడా దుమ్ము లేపగా ఇప్పుడు బాలీవుడ్ లో మరో లెవల్ లో రచ్చ లేపుతూ దూసుకు పోతున్నాయి….ఒకప్పుడు హిట్ అయిన మూవీస్ కి మించి ఒకప్పుడు ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేక పోయిన సినిమాలకు ఇప్పుడు…..
ఎక్స్ లెంట్ రెస్పాన్స్ రీ రిలీజ్ లలో సొంతం అవుతూ ఉండటం విశేషం….తుంబాద్ సినిమా ఊహకందని కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ సినిమాను కూడా మించి 9 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు 1 కోటితో ఓపెన్ అయ్యి 8 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ తో క్లోజ్ అయిన…
హర్షవర్దన్ రానే హీరో గా హిందీలో చేసిన సనం తేరీ కసం(Sanam Teri Kasam) మూవీ వీర లెవల్ లో వీరంగం సృష్టిస్తూ హిందీ లో ఇప్పుడు కొత్త సినిమాల రేంజ్ లో వసూళ్ళని అందుకుంటూ దూసుకు పోతుంది. రీ రిలీజ్ లో మొదటి రోజు 4.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా..
రెండో రోజు 5.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో ట్రేడ్ లెక్కల్లో 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది….రీ రిలీజ్ మూవీస్ లో ఒక రోజు 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఒకే ఒక్క మూవీ గా ఇప్పుడు…
ఈ సినిమా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. టోటల్ గా వీకెండ్ లో సినిమా ఏకంగా 16.5 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే 9 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు 8 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కేవలం…
3 రోజుల వీకెండ్ లోనే ఏకంగా డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇక 4వ రోజున వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టినా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తున్న సినిమా 4వ రోజున 2.5-3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అని అంచనా వేస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.