Home న్యూస్ సంక్రాంతి మూవీస్(14-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

సంక్రాంతి మూవీస్(14-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

2024 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన అన్ని సినిమాలు వన్ బై వన్ రిలీజ్ అయ్యాయి, మొత్తం మీద అన్ని సినిమాలు ఈ రోజు నుండి ఫుల్ పండగ హాలిడేస్ ను ఎంజాయ్ చేయబోతూ ఉండగా ఏ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా అన్ని సినిమాలు ఉన్నంతలో వేటి రేంజ్ లో అవి బాక్స్ అఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తున్నాయి…

|హనుమాన్|Hanuman Day 3 Collections
మొత్తం మీద హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ గా షోలు పెరిగాయి, కానీ అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడటంతో ఈ సినిమా ఓవర్ ఫ్లో ఇతర సినిమాలకు ప్లస్ కాబోతుంది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 5కోట్ల రేంజ్ నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13-15కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

|గుంటూరు కారం|- Guntur Kaaram Day 3 Collections
బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మూడో రోజు నైజాంలో డ్రాప్ అవ్వగా ఆంధ్రలో మంచి జోరుని చూపించింది, మ్యాట్నీ షోల నుండి సినిమా జోరు చూపిస్తూ ఉండగా నైట్ షోలకు కూడా బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గా ఉండగా సినిమా మూడో రోజు మొత్తం మీద అటూ ఇటూగా రెండో రోజు లెవల్ లో షేర్ ని అందుకోవచ్చు, ఆంధ్రలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

|సైంధవ్| Saindhav 2nd Day Collections
బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ రెండో రోజులో అడుగు పెట్టగా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా అన్ని సినిమాల లోకి లీస్ట్ ప్రియారిటీ ఈ సినిమాకి వెళ్ళింది, రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.

|నా సామి రంగ| – Naa saami Ranga 1st Day Collections
బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నా సామి రంగ సినిమా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా ఉన్న లిమిటెడ్ రిలీజ్ లో సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు 3.5-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అంచనాలను మించిపోవచ్చు.

మొత్తం మీద ఈ రోజు ఉన్నంతలో ఏ సినిమా రేంజ్ లో ఆ సినిమా మంచి జోరునే చూపిస్తూ ఉండగా అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్ లో ఉంటుందా లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here