2020 ఇయర్ టాలీవుడ్ తొలి బిగ్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయింది, ముందు గా ప్రీమియర్ షోలను పూర్తీ చేసు కున్న ఈ సినిమా కి ఆ షోల నుండి మంచి పాజిటివ్ టాక్ లభించగా ఇప్పుడు రెగ్యులర్ షోల తర్వాత ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టు కుందో తెలుసు కుందాం పదండీ..
కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు…. తన జాబ్ లో ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండే విజయశాంతికి ఒక రౌడీ మినిస్టర్ నుండి ఇబ్బంది వస్తుంది, ఎవ్వరూ ఆదుకోలేని పరిస్థితులో ఉన్న విజయశాంతికి అండగా నిలుస్తాడు హీరో. ఆమె ప్రాబ్లం ఏంటి.. మిలటరీ ఆఫీసర్ అయిన హీరో ఆమెకి ఎందుకు హెల్ప్ చేశాడు…
అసలు ప్రకాష్ రాజ్ కి విజయశాంతికి గొడవ ఎందుకు అయింది, హీరో ఎలా విలన్ పై గెలిచాడు, హీరోయిన్ తో లవ్ స్టొరీ ఏంటి ఇలాంటివి అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాఫ్ఫాడించాడు. రీసెంట్ రొటీన్ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తర్వాత…
మళ్ళీ ఖలేజా, దూకుడు రోజులను గుర్తు చేస్తూ స్క్రీన్ పై ఫుల్ ఎనర్జీ తో మహేష్ దుమ్ము లేపాడు, పార్టీ సాంగ్, మైండ్ బ్లాక్ సాంగ్స్ లో స్టెప్స్ తో కూడా కుమ్మేశాడు. ఓవరాల్ గా ఇది పూర్తిగా మహేష్ వన్ మ్యాన్ షో మూవీ. రష్మిక మహేష్ ల జోడి ఫ్రెష్ గా ఉంది…
తన పెర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుంది, ఇక విజయశాంతి రోల్ మరీ బయట ఇచ్చినంత హైప్ లేదు కానీ ఉన్నంతలో బాగానే ఉండగా ప్రకాష్ రాజ్ రోల్ రొటీన్ అయినా మెప్పిస్తుంది, మిగిలిన స్టార్ కాస్ట్ పెద్దది కాగా ఉన్నంతలో అందరూ ఆకట్టుకున్నారు. ఇక సంగీతం విషయం లో…
పాటలు వినడానికి పర్వాలేదు అనిపించినా వెండితెరపై మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో దేవి తన మార్క్ ని చూపెట్టలేదు, ఉన్నంతలో ఓకే అనిపించుకున్నాడు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ఫాఫ్ కొన్ని సీన్స్ సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అవుతుంది.
సినిమాటోగ్రఫీ అదిరిపోగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక డైరెక్షన్ పరంగా అనిల్ రావిపూడి చాలా సింపుల్ కథని తీసుకున్నా దాన్ని పార్టు పార్టులుగా విడదీసి సీన్ బై సీన్ ఆడియన్స్ కి ఎలా మెప్పించాలి అన్న దానిపై ఎక్కువ వర్కౌట్ చేశాడు. అది చాలా సీన్స్ లో పెర్ఫెక్ట్ గా సెట్ అయింది.
కొన్ని సీన్స్ తేడా కొట్టినా ఓవరాల్ గా ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఇవ్వడంలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులను అన్నీ ఉండేలా చూసుకున్న అనిల్ రావిపూడి శ్రీనువైట్ల తర్వాత ది బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…
మహేష్ వన్ మ్యాన్ షో, విజయశాంతి పెర్ఫార్మెన్స్, కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకెండ్ ఆఫ్ 2 మాస్ ఫైట్స్… హీరోయిజం సీన్స్, మైండ్ బ్లాక్ సాంగ్ మేజర్ ప్లస్ పాయింట్స్, ఇక మైనస్ పాయింట్స్ కథ సింపుల్ గా ఉండటం, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అవ్వడం… లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలగడం లాంటి చిన్న చిన్నవి…
ఓవరాల్ గా పండగ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసుకుంటే ఇది పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ మాస్ ఎలిమెంట్స్… ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి… ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి. రొటీన్ ఆడియన్స్ రెగ్యులర్ గా చూసే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి.
మొత్తం మీద సినిమా పైసా వసూల్ మూవీ అని చెప్పాలి. సినిమా కి మా రేటింగ్ [3.25 స్టార్స్]… ఇక పైసా వసూల్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అన్నది పండగకి రిలీజ్ అయ్యే వేరే మూవీస్ రిజల్ట్ అండ్ సినిమా ని పైన చెప్పిన ఆడియన్స్ చెప్పినట్లే రిసీవ్ చేసుకుంటారో లేదో అన్న దాని పై ఆధారపడి ఉంటుంది.