టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, సినిమా మహేష్ కెరీర్ లో కొంత గ్యాప్ తర్వాత వస్తున్న పక్కా కమర్షియల్ మూవీ అవ్వడం తో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక సినిమా ముందుగా ప్రీమియర్ షోలను పూర్తీ చేసు కోగా టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.
కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయక పోయినా కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ తన ఊరికి వెళుతున్న టైం లో హీరోయిన్ తో లవ్ తర్వాత విజయశాంతి కి సహాయం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, అసలు విజయశాంతి కి హీరో ఎందుకు సహాయం చేశాడు,
మధ్యలో విలన్ ప్రకాష్ రాజ్ కి విజయశాంతి కి గొడవ ఎందుకు దాన్ని హీరో ఎలా ఎదిరించాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా మహేష్ బాబు దుమ్ము దులిపెశాడని అంటున్నారు. ముఖ్యంగా సినిమా పూర్తిగా మహేష్ వన్ మ్యాన్ షో అని అంటున్నారు.
సాంగ్స్ లో డాన్స్ కూడా కుమ్మేయగా హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో తన స్క్రీన్ ప్రజన్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడని అంటున్నారు. ఇక తన కామిక్ టైమింగ్ తో కూడా మెప్పించాడట. ఇక హీరోయిన్ రష్మిక తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుందని అంటున్నారు.
విజయశాంతి రోల్ పవర్ ఫుల్ గా ఉండగా ప్రకాష్ రాజ్ విలనిజం ఆకట్టుకుందని, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయని అంటున్నారు. కొంచం లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కామెడీ డోస్, ఫ్యాన్స్ కోరుకునే సీన్స్ సెట్ అవ్వడం తో…
సినిమా చాలా వరకు బోర్ కొట్టకుండా ఉంటుందని, ఫస్టాఫ్ వరకు ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉండగా ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఫైట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకెండ్ ఆఫ్ హీరో విలన్ ల మధ్య పోటి ఆసక్తిగా నువ్వా నేనా అన్నట్లు సాగుతుందని అంటున్నారు.
ఓవరాల్ గా కథ మరీ గ్రిప్పింగ్ గా లేదు కానీ స్క్రీన్ ప్లే తో కామెడీ తో ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో డైరెక్టర్ సినిమాను నడిపించాడని, సినిమా దూకుడు రేంజ్ లోనే చాలా వరకు ఆకట్టుకుందని, రీసెంట్ భరత్ అనే నేను మహర్షి లతో పోల్చితే చాలా బెటర్ అని అంటున్నారు.
ఓవరాల్ గా సినిమా కి ప్రీమియర్ షోల నుండి హిట్ రేంజ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ వినిపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ బాబు ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోల కి సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.