Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ రివ్యూ….అరాచకం అంతే!!

సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ రివ్యూ….అరాచకం అంతే!!

1

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా ఘనంగా జరిగింది, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా రాగా ఆయన చేతుల మీదుగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో…

అనిల్ రావిపూడి చాలా బాగా చూపెట్టాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీ సీన్స్ తో సెకెండ్ ఆఫ్ నుండి యాక్షన్ సీన్స్ తో సినిమా నిండిపోతుందని, ట్రైలర్ ని కూడా సగం కామెడీ సగం యాక్షన్ పార్ట్ తో నింపేశాడు. మహేష్ డైలాగ్స్, కామిక్ టైమింగ్ మెప్పించాగా…

యాక్షన్ సీన్స్ లో యాటిట్యూడ్ దూకుడు, ఖలేజా లని తలపించింది, విజయశాంతి రోల్ కూడా బాగుండగా రష్మిక అండ్ ఫ్యామిలీ కామెడీ కొంచం అతిగా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ లో కామెడీ పార్ట్ జస్ట్ ఒకే అనిపించే విధంగా ఉండగా… యాక్షన్ పార్ట్ ఆకట్టుకుంది.

దేవి బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి బాగుంది. ఓవరాల్ గా ట్రైలర్ రీసెంట్ టైం లో మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కమర్షియల్ గా పక్కాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ట్రైలర్ చూస్తుంటే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా దూకుడు ఆగడు తర్వాత…

మహేష్ నుండి వస్తున్న బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే అవ్వడం తో కచ్చితంగా సంక్రాంతి బరిలో సినిమా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ట్రైలర్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుంది అన్నది ఆసక్తి గా మారింది. మీరు ట్రైలర్ చూసేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here