ఆర్య హీరోగా కబాలి, కాలా ఫేం పా రంజిత్ డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సార్పట్ట పరంపర థియేటర్స్ లో కాకుండా డిజిటల్ లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ వర్షన్ తో పాటు తెలుగు డబ్ వర్షన్ ని కూడా కలిపి రిలీజ్ చేశారు. సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి చూడటం మొదలు పెట్టిన తర్వాత సినిమా ఎలా అనిపించిందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే… బ్రిటిష్ వాళ్ళ నుండి బాక్సింగ్ నేర్చుకుని వాళ్ళనే ఓడించి తమిళనాడులో 70 టైం లో ఆ ఆటని పాపులర్ చేయడంతో ఆ ఆటని అలాగే కొనసాగిస్తారు… అందులో సార్పట్ట వాళ్ళది ఎప్పుడు పైచేయిగా ఉంటుంది కానీ మరో బృందం వాళ్ళది కొంత కాలంగా…
పైచేయిగా ఉంటూ వస్తుండగా వాళ్ళని ఓడించడానికి సరైన ఆటగాడికోసం చూస్తున్న టైం లో ఆర్య రంగంలోకి దిగుతాడు. మరి తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చెప్పాలి అంటే చాలా సింపుల్ స్టొరీ పాయింట్ ని ఆల్ మోస్ట్ 3 గంటల నరేషన్ ఇచ్చేశాడు దర్శకుడు పా రంజిత్…
కానీ నటన పరంగా ఆర్య అదరగొట్టేశాడు… మరో బాక్సర్ వేటపులి కూడా బాగా ఆకట్టుకోగా ఆర్యకి గురువుగా పశుపతి నటన బాగుంది, మిగిలిన యాక్టర్స్ కూడా ఆకట్టుకోగా, సినిమాలో ఒకే పాట ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది, ఎడిటింగ్ అనస్ స్క్రీన్ ప్లే అప్పటి టేస్ట్ మేరకు స్లోగా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే పా రంజిత్…
రీసెంట్ టైం లో తీసిన కబాలి కానీ కాలా సినిమాలు పూర్తీ నిరాశ పరచడంతో ఈ సినిమా పై అసలు ఏమాత్రం అంచనాలు లేవు, కానీ అదే సినిమాకి ప్లస్ అయింది, సినిమా మొదలు పెట్టిన 5 నిమిషాలకే ఈజీగా సినిమాకి కనెక్ట్ అవుతాం. అలాగే చక చక సీన్స్ వస్తూ ఇంటర్వెల్ అయ్యే లోపు ఫస్టాఫ్ అదిరి పోయింది అనిపిస్తుంది.
మంచి కిక్ ఇచ్చిన ఫస్టాఫ్ తర్వాత సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరుగాయి కానీ సెకెండ్ ఆఫ్ కథ ఎటు నుండి ఏటో పోతుంది… బాక్సర్ గా ఎదిగిన హీరో మళ్ళీ ఎలా పతనానికి గురి అయ్యాడు…మళ్ళీ తిరిగి ఎలా ఎదిగాడు అన్న కథ సెకెండ్ ఆఫ్ ని మరీ లాగ్ కి గురి అయ్యేలా చేస్తుంది… అదే సినిమా కి మేజర్ మైనస్ పాయింట్ అయింది. అయినా కానీ…
తిరిగి మళ్ళీ క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే మెప్పించి పర్వాలేదు అనిపించే విధంగా ముగించాడు డైరెక్టర్… కొంచం లెంత్ తగ్గించి, సెకెండ్ ఆఫ్ లో కొంచం లాగ్ ని తగ్గించి ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది. మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ కుమ్మితే సెకెండ్ ఆఫ్ యావరేజ్ గా అనిపించింది. ఓవరాల్ గా సినిమా బాగానే మెప్పించింది అని చెప్పాలి…
కబాలి, కాలా సినిమాలతో పోల్చితే పా రంజిత్ చాలా బెటర్ అవుట్ పుట్ ని ఈ సారి ఇచ్చాడు అని చెప్పాలి. అది ఆడియన్స్ కి బాగా నచ్చేలా ఉందని చెప్పాలి, బాక్సింగ్ నేపధ్యంలో చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కూడా అవ్వడం కొంచం రీ ఫ్రెషింగ్ గా కూడా అనిపించింది. మీరు మీ ఫ్రీ టైం లో సినిమా చూసి ఎలా అనిపించిందో చెప్పండి.