Home న్యూస్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ రివ్యూ…ఈ రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేయలేదు!!

ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ రివ్యూ…ఈ రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేయలేదు!!

1712
0

టాలీవుడ్ లో కొత్త టాలెంట్ ఉరకలు వేస్తూ దూసుకు పోతుంది, కొత్తగా వస్తున్న నటీనటులు రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలు చేయకుండా కొత్త కాన్సెప్ట్ లను అనుకుని తమ టాలెంట్ ని చూపెడుతూ ఉండటం విశేషం, సైడ్ రోల్స్, కామెడీ రోల్స్ చేసిన నటుడు సుహాస్ ఆడియన్స్ ను హీరోగా చేసిన మొదటి సినిమా కలర్ ఫోటో తో బాగా మెప్పించాడు. అంతకన్నా ముందు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా లో…

చేసిన సైడ్ రోల్ తో మెప్పించాగా కలర్ ఫోటోలో నాచురల్ నటనతో ఆకట్టుకున్న సుహాస్ ఆ సినిమా తర్వాత చేస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ డ్రామా… చూడటానికి ఎదో ఫ్యామిలీ సినిమాలా అనిపించినా ఇది ఒక సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమా…

సిటీలో తిరిగే ఒక వ్యక్తీ జనాలను చంపుతూ ఉంటాడు, తర్వాత తెలుస్తుంది తను ఒక సైకో అని, అలాంటి సైకో ఒకరితో ఫ్రెండ్ షిప్ చేయడం, అనుకోకుండా ఆ ఫ్రెండ్ షిప్ చేసిన వ్యక్తీ ఫ్యామిలీ లో ఈ సైకో ఎంటర్ అవ్వడం తర్వాత కథ ఏం అయింది అన్నది మొత్తం మీద సినిమా కథగా…

ట్రైలర్ లో చూపెట్టారు, కలర్ ఫోటోకి పూర్తీ కాంట్రాస్ట్ ఉన్న రోల్ ని ఎంచుకున్న సుహాస్, ఈ సారి సైకోగా ట్రైలర్ లోనే అదరగొట్టేశాడు, చాలా నార్మల్ గా ఉన్నట్లు కనిపించడం ప్రవర్తన మాత్రం భిన్నంగా అనిపించడం హెయిర్ కట్ డిఫెరెంట్ గా ఉండటం, జనాల గొంతు కోసి చంపడం లాంటి సీన్స్ తో ఫస్ట్ టైం చూసినప్పుడే ట్రైలర్ సాలిడ్ షాకిచ్చింది.

ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకుని ట్రైలర్ తోనే సుహాస్ సగం పాస్ మార్కులు కొట్టేశాడు అని చెప్పాలి. అప్పట్లో ప్రకాష్ రాజ్ ఆలీల కాంబోలో ఇలాంటి సైకో థ్రిల్లర్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా రాబోతుంది. ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను పెంచేసింది, ఇక సినిమా ఎంతవరకు ఈ అంచనాలను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here