Home న్యూస్ శబ్దం మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

శబ్దం మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు పెద్దగా హిట్స్ లేని ఆదిపినిశెట్టి అప్పట్లో వైశాలి లాంటి మంచి హిట్ కొట్టిన కాంబో లో చేసిన లేటెస్ట్ మూవీ అయిన శబ్దం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాగా ట్రైలర్ పర్వాలేదు అనిపించేలా ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

ముందుగా కథ పాయింట్ కి వస్తే కేరళలో మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటంతో ఈ మిస్టరీ ని చేదించడానికి ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయిన హీరోని రప్పిస్తారు….సౌండ్స్ ద్వారా ఆత్మలను కనిపెట్టే హీరో రంగం లోకి దిగిన తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ…

హర్రర్ టచ్ ఉన్న కథలు అంటే రెగ్యులర్ గా దెయ్యాలను చూపించడం బయపెట్టడం లాంటివి సినిమాల్లో చేస్తూ ఉంటారు…కానీ వాటికి పూర్తి డిఫెరెంట్ గా టైటిల్ కి తగ్గట్లు సౌండ్స్ తోనే డిఫెరెంట్ గా బయపెట్టే ప్రయత్నం చేసిన డైరెక్టర్ చాలా వరకు తన మార్క్ ని చూపించాడు..

ఫస్టాఫ్ కథ సౌండ్స్ ఎఫెక్ట్ తో బాగా మెప్పించడం, డిఫెరెంట్ బ్యాగ్ డ్రాప్ ను ఎంచుకోవడంతో తర్వాత సీన్ ఏమవుతుందా అన్న ఆసక్తి ఫస్టాఫ్ అంతా కంటిన్యూ అయ్యి మంచి పాయింట్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్ పడటంతో…సెకెండ్ ఆఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనుకుంటే…

రెగ్యులర్ టచ్ తోనే సాగినప్పటికీ కూడా ఎండ్ అవ్వడం పర్వాలేదు అనిపించేలా ఎండ్ అయ్యి ఓవరాల్ గా డీసెంట్ థ్రిల్లర్ గా ఎండ్ అవుతుంది సినిమా…సెకెండ్ ఆఫ్ ని ట్విస్ట్ లు రివీల్ చేయడం ఫస్టాఫ్ రేంజ్ లో రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది అని చెప్పాలి…

మొత్తం మీద ఆదిపినిశెట్టి తన రోల్ వరకు బాగా మెప్పించగా తన పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది. ఇక ఇతర క్యారెక్టర్స్ అందరూ కూడా తన తమ రోల్స్ లో మెప్పించగా, బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ సౌండింగ్ సినిమాకి మేజర్ హైలెట్ అని చెప్పాలి…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో బాగా మెప్పించగా సెకెండ్ ఆఫ్ కొంచం డౌన్ అయింది…

ఓవరాల్ గా సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన శబ్దం మూవీ ఇలాంటి డిఫెరెంట్ మూవీస్ ఇష్టపడే వాడికి డిఫెరెంట్ సౌండింగ్ లాంటివి ఇష్టపడే ఆడియన్స్ కి ఈజీగా ఒకసారి చూసేలా ఉంటుంది శబ్దం మూవీ..సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here