బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతుంది అనుకున్నా కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయిన హిందీ మూవీ షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ బ్లడీ డాడీ మూవీ…. రీసెంట్ గా జియో సినిమాలో డైరెక్ట్ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ కి ఫ్రీగా స్ట్రీం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ఇక సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే కోవిడ్ టైంలో నార్కోటిక్ ఆఫీసర్ అయిన హీరో ఒక భారీ డ్రగ్స్ మాఫియాని పట్టుకుంటాడు…
ఈ క్రమంలో ఒక వ్యక్తీ చనిపోగా ఆ ముఠా హీరో వెనకపడతారు, హీరో కొడుకుని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు అన్నది అసలు కథ…. చాలా చాలా నార్మల్ స్టొరీ పాయింట్ తో వచ్చిన ఈ సినిమా యాక్షన్ లవర్స్ కి కొంచం టైం పాస్ మూవీ అనొచ్చు…
యాక్షన్ సీన్స్ చాలా వరకు జాన్ విక్ మూవీని గుర్తు చేస్తాయి, సినిమాటోగ్రఫీ కూడా ఇదే విధంగా ఉంటుంది, కానీ సినిమా ఎక్కడో ట్రాక్ తప్పినట్లు అనిపించడం ఖాయం, ఇందుకేనెమో సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా ఇలా డిజిటల్ లో రిలీజ్ చేశారు అనిపిస్తుంది…
ఓవరాల్ గా సినిమా కొంచం బోర్ ఫీల్ అయినా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది.. థియేటర్స్ లో అయితే చూసే రేంజ్ బొమ్మ అయితే కాదని చెప్పాలి. ముఖ్యంగా కబీర్ సింగ్ తర్వాత షాహిద్ నుండి అలాగే సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి మూవీస్ తర్వాత అలీ అబ్బాజ్ జాఫర్ ల కాంబో లో మూవీ అంటే ఆ రేంజ్ కి సినిమా చాలా దూరంలో ఆగిపోయింది…