లాక్ డౌన్ టైం లో కొత్త సినిమాలు ఏవో ఒకటి రిలీజ్ అవుతూనే ఉండగా బాలీవుడ్ నుండి భారీ ఎత్తున కొత్త సినిమాలు వారం వారం గ్యాప్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ వారం విద్యాబాలన్ ముఖ్య పాత్రలో నటించిన బయోపిక్ మూవీ శకుంతల దేవి సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ విషయానికి వస్తే శకుంతల దేవి కూతురు తల్లి మీద లీగల్ కేసు వేస్తుంది, దానికి రీజన్ ఏంటి, లెక్కలను ఎక్కువగా ప్రేమించే విద్యాబాలన్ కి తన కూతురికి మధ్య గొడవ ఏంటి, చివరికి వీరు కలిసారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కేవలం థీం పాయింట్ మాత్రమే రివీల్ చేసి అసలు సిసలు కథ లీకులు చేయడం లేదు… విద్యాబాలన్ పెర్ఫార్మెన్స్ టాప్ నాట్చ్ అనే చెప్పాలి. తన ఎనర్జీ మరో లెవల్ లో ఉంటుంది, తన నటన ఎంత సహజంగా ఉందనేది మాటల్లో చెప్పలేం… తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది అని చెప్పాలి.
ఇక విద్యాబాలన్ కూతురిగా నటించిన దంగల్ మూవీ నటి… సన్య మల్హోత్రా కూడా మెప్పించగా మిగిలిన పాత్రలు అన్నీ కూడా పరిది మేర ఆకట్టుకుంటాయి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ కుమ్మేసినా సెకెండ్ ఆఫ్ స్లో అయింది.
సీన్స్ కొంచం రిపీటెడ్ గా అనిపించడం లాంటివి కొంచం బోర్ కొట్టించినా ఓవరాల్ గా సినిమా మెప్పిస్తుంది. డైరెక్షన్ కూడా బాగుండగా బయోపిక్ స్టొరీ అవ్వడం తో కొంచం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కానీ సినిమా మాత్రం ఇండియా లో వచ్చిన బయోపిక్స్ లో వన్ ఆఫ్ బెస్ట్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
చిన్న మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే… ఎంతటి క్లిష్టమైన మాత్స్ ప్రాబ్లమ్స్ అయినా యిట్టె విద్యాబాలన్ ఎలా సాల్వ్ చేయగలుగుతుంది అన్నది మరింత వివరంగా చెప్పాల్సింది. అలాగే సెకెండ్ ఆఫ్ సీన్స్ రిపీటివ్ గా ఉండకుండా చూసుకుంటే సినిమా మరింత బాగా మెప్పించి ఉండేది.
ఈ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ని పక్కకు పెడితే ఫాస్ట్ 45 నిమిషాలు సినిమా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అదే సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలవగా స్టార్ కాస్ట్ నటన ప్లస్ అయింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, హ్యూమన్ కంప్యూటర్ గా పిలుచుకునే లేట్ శకుంతల దేవి గారి జీవిత కథ అందరికీ కచ్చితంగా నచ్చి తీరుతుంది.
తల్లి కూతుళ్ళ అనుభందం, తల్లిన అమ్మగానే కాకుండా ఒక మహిళాగా ఎలా చూడాలి, తన కి ఎలాంటి ఆశయాలు ఉంటాయి లాంటివి బాగా చూపెట్టారు. కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ సినిమా కొత్త రకం మూవీస్ ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చి తీరే సినిమా అని చెప్పాలి. సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…