టాలీవుడ్ లో మూడు స్ట్రైట్ సినిమాలు అలాగే ఒక డబ్బింగ్ మూవీ తో కలిపి మొత్తంగా 4 సినిమాలు సంక్రాంతి రేసు లో పోటి లో నిలిచాయి. ఫైనల్ గా ఒక్క సినిమా తప్ప అన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక తమిళనాడు లో మొత్తం మీద 2 సినిమాల మధ్య పోటి ఉండగా విజయ్ మాస్టర్ సినిమా సునామీ ముందు శింభు కంబ్యాక్ మూవీ అని చెప్పుకుంటున్న ఈశ్వరన్ సినిమా…
ఎంతవరకు పోటి ఇస్తుంది అని అంతా ఆశగా ఎదురు చూడగా సినిమా కి షాకింగ్ గా పోటి లో కూడా 7.25 కోట్ల రేటు ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ తో కొండంత మాస్టర్ తో పోటి కి సిద్ధం అయింది.
మాస్టర్ సినిమా టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు మాత్రం ఏమాత్రం తగ్గకుండా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఈశ్వరన్ సినిమా కి చాలా తక్కువ థియేటర్స్ అక్కడ దొరికాయి, అయినా కానీ టాక్ పాజిటివ్ గా ఉండటం తో…
మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 4 రోజుల వీకెండ్ పూర్తీ అయ్యే సరికి టార్గెట్ లో సగానికి పైగా అయితే కవర్ చేయగలిగింది. సినిమా మొత్తం మీద 4 రోజుల్లో తమిళనాడు లో 8 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం, అంత పోటి లో ఇది చాలా తక్కువ కలెక్షన్స్ అనే చెప్పాలి కానీ మాస్టర్ క్రేజ్ ముందు నిలవడం అంటే…
మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇప్పటికీ అక్కడ మాస్టర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. కానీ టాక్ పరంగా ఈ సినిమా కే బెస్ట్ టాక్ ఉన్నప్పటికీ థియేటర్స్ తక్కువ ఇవ్వడం తో కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ లో లేవు. ఇక బ్రేక్ ఈవెన్ కి మరో 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.