బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ హీరోలతో పోల్చితే ధనుష్ కి తెలుగు లో పెద్దగా మార్కెట్ లేదు, కానీ అలాంటి హీరో సార్ అనే బైలింగువల్ మూవీతో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో కోలివుడ్ హీరోల పరంగా తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరిగా నిలిచి ఒక్క సినిమాతోనే సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు ఇప్పుడు…
ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సార్ మూవీ తమిళనాడులో కన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్ళని అందుకోవడం మరింత విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ కి గాను టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 9.05Cr
👉Ceeded: 3.18Cr
👉UA: 3.38Cr
👉East: 2.06Cr
👉West: 94L
👉Guntur: 1.65Cr
👉Krishna: 1.52Cr
👉Nellore: 82L
AP-TG Total:- 22.60CR(43.30CR~ Gross)
👉KA+OS – 1.40Cr
Total WW Collections – 24.00CR(46.30CR~ Gross)
ఇదీ సినిమా తెలుగు వర్షన్ టోటల్ గా సాధించిన కలెక్షన్స్ రిపోర్ట్…
తెలుగు బిజినెస్ 6 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 6.70 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో ఏకంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 17.30 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ ప్రాఫిట్స్ తో బిగ్గెస్ట్ రికార్డ్ ను తమిళ్ హీరోల పరంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలతో దుమ్ము లేపి ధనుష్ సంచలనం సృష్టించాడు.