Home TRP రేటింగ్ బాక్స్ ఆఫీస్ డిసాస్టర్…4.5 కోట్లకు అమ్మితే…సీత..TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

బాక్స్ ఆఫీస్ డిసాస్టర్…4.5 కోట్లకు అమ్మితే…సీత..TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

0

     కొన్ని కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కానీ బుల్లి తెరపై మాత్రం సక్సెస్ అవుతాయి. ఈ రెండో కోవ కే ఇప్పుడు లేటెస్ట్ గా కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీత చేరుతుంది, ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది, కాగా బాక్స్ ఆఫీస్ ఫలితం చూసి అందరు షాక్ కూడా అయ్యారు.

అలాంటి సినిమాను మాటివి వారు ఏకంగా 4.5 కోట్ల రేంజ్ అమౌంట్ దాకా పెట్టి రైట్స్ కొన్నారట. దాంతో టెలికాస్ట్ అయినప్పుడు ఎలాంటి TRP రేటింగ్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు…

7.53 TRP రేటింగ్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది, ఇది కొన్ని పెద్ద సినిమాల TRP రేటింగ్ కన్నా కూడా చాలా బెటర్ TRP రేటింగ్ గా చెప్పుకోవాలి, ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే మొదటి సారి టెలికాస్ట్ కే చానెల్ కి మంచి అమౌంట్ రిటర్న్ వచ్చిందట. దాంతో మరోసారి టెలికాస్ట్ సమయానికి…

స్టార్ మా టివి కి మంచి లాభాలు ఖాయమని చెప్పొచ్చు. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో కాజల్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించారు. వీరి కాంబో లో ఈ ఇయర్ కవచం సినిమా రాగా ఆ సినిమా తో పాటు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాయి.

వెండితెరపై నిరాశ పరిచినా కానీ బుల్లి తెరపై మాత్రం సినిమా పర్వాలేదు అనిపించే TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. క్లైమాక్స్ పై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ కూడా కొంచం బెటర్ గా ఉండేదని విశ్లేషకుల అంచనా… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here