Home TRP రేటింగ్ 3.15 కోట్లకు అమ్మితే 118 మూవీ TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

3.15 కోట్లకు అమ్మితే 118 మూవీ TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

0

     పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఆశగా 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం లో ప్రయోగాత్మక సినిమా 118 తో ప్రేక్షకుల ముందుకు ఈ ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎక్స్ పెరిమెంటల్ మూవీ నే అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ రిజల్ట్ ని సొంతం చేసుకుని మంచి కంబ్యాక్ గా నిలిచింది.

కాగా తర్వాత సినిమా ను జెమినీ టివి వారు సినిమా 3.15 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. కాగా రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా TRP రేటింగ్ పరంగా అట్టర్ ఫ్లాఫ్ అయిన సీత కి పోటి గా టెలికాస్ట్ అయినా ఆ సినిమా కన్నా కొంచం…

తక్కువ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది, సీత కి 7.53 TRP రేటింగ్ దక్కగా మొదటి సారి టెలికాస్ట్ అయిన 118 మూవీ కి 6.33 TRP రేటింగ్ దక్కింది. కానీ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఎంత లేదన్నా 10+ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కొంచం నిరాశ పరిచింది.

కానీ అదే సమయం లో కొన్ని పెద్ద సినిమాల కన్నా కూడా బెటర్ TRP రేటింగ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా 6 కోట్లకు పైగా బిజినెస్ ని సాధించి టోటల్ రన్ లో 11 కోట్లకు పైగా షేర్ ని అందుకుని మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచింది.

కానీ బుల్లి తెరపై మాత్రం ఎందుకనో అనుకున్న రేంజ్ లో TRP రేటింగ్ దక్కలేదు, కానీ ఉన్నంతలో చానెల్ కి మొదటి సారే 80% వరకు పెట్టుబడి రికవరీ అయినట్లు సమాచారం. ఇక రెండో సారి టెలికాస్ట్ అయినప్పటి నుండి చానెల్ కి లాభాలు ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here