బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా కూడా రెండో రోజు పాజిటివ్ టాక్ పవర్ తో మంచి జోరుని చూపెడుతుంది అనుకున్నా కూడా నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా పెద్దగా జోరు చూపించలేదు…
సినిమాకి సోలో బిగ్ రిలీజ్, అలాగే మంచి పాజిటివ్ టాక్ ఉన్నా కూడా రెండో రోజు వర్కింగ్ డే అయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా సినిమా అతి కష్టం మీద 3.04 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని అండర్ పెర్ఫార్మ్ చేసింది.
ఓవరాల్ గా టాక్ బాగుండి కూడా కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన మూవీస్ లో ముందు నిలిచింది అని చెప్పొచ్చు. ఇది వరకు ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఫ్లాఫ్ మూవీ స్కంద రెండో రోజు 3.52 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక ఈ ఇయర్ సరిపోదా శనివారం లాగే….
పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న మీడియం బడ్జెట్ మూవీస్ హనుమాన్ 4.36 కోట్ల షేర్ ని అందుకోగా, టిల్లు స్క్వేర్ మూవీ 7.36 కోట్లతో రికార్డ్ కొట్టింది…కానీ నాని సరిపోదా శనివారం రెండో రోజు మాత్రం 3.04 కోట్ల మార్క్ నే అందుకోగా…
నాని వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ లాంటి క్లాస్ మూవీ రెండో రోజు 3.48 కోట్ల షేర్ ని అందుకుంది. ఆ సినిమాతో పోల్చితే కమర్షియల్ గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న సరిపోదా శనివారం ఇంకా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా అలాంటిది జరగలేదు…ఇక మూడు నాలుగు రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.