Home న్యూస్ స్కంద ట్రైలర్2 రికార్డ్…టాప్ 4 లో 2 రామ్ పేరిటే!!

స్కంద ట్రైలర్2 రికార్డ్…టాప్ 4 లో 2 రామ్ పేరిటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) ఈ శుక్రవారం భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి…

సిద్ధం అవుతూ ఉండగా సినిమా మొదటి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్ మొదటి ట్రైలర్ కన్నా బెటర్ గా ఉండగా ఓవరాల్ గా ఆడియన్స్ నుండి…

రెస్పాన్స్ కూడా చాలా బెటర్ గా సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో 24 గంటలు పూర్తి అయ్యే టైం కి 12.92 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఆల్ మోస్ట్ టాప్ స్టార్ మూవీస్ ట్రైలర్ లకు వచ్చే రేంజ్ లో…

ఈ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక లైక్స్ పరంగా మాత్రం 160.3K లైక్స్ మార్క్ ని అందుకుని పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా వ్యూస్ పరంగా సినిమా ట్రైలర్2 మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుంది…

రెండో ప్లేస్ లో స్కంద ట్రైలర్ 1 మొత్తం మీద 13.20 మిలియన్ వ్యూస్ ని అందుకోగా 4వ ప్లేస్ లో స్కంద ట్రైలర్2 నిలిచింది. ఓవరాల్ గా సినిమా మీద ఇప్పుడు మంచి బజ్ తిరిగి ఏర్పడగా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here