Home న్యూస్ TIGER3 టీసర్ రివ్యూ…ఇంకో 500 కోట్ల సినిమా రెడీ….మాస్!

TIGER3 టీసర్ రివ్యూ…ఇంకో 500 కోట్ల సినిమా రెడీ….మాస్!

0

బాలీవుడ్ బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. ఆల్ రెడీ రెండు బాక్ టు బాక్ 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మూవీస్ తో అల్టిమేట్ ఫామ్ లో ఉన్న బాలీవుడ్ లో ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసే సినిమాగా…

అనిపిస్తున్న ఊరమాస్ మూవీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న టైగర్3 మూవీ(Tiger3 Movie) యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో వస్తున్న కొత్త సీక్వెల్ కాగా ఈ యూనివర్స్ మొదలు అయిందే ఏక్ థా టైగర్ నుండి కాగా తర్వాత ఇతర సినిమాలు వచ్చాయి.

ఈ ఇయర్ పఠాన్ మూవీ ఇందులో భాగంగా మారగా ఇప్పుడు టైగర్3 సినిమా మీద భారీ అంచనాలు ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు. ఆ టీసర్ చూస్తూ ఉంటే సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయేలా ఉంది..

టేకింగ్ విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా అప్పటి వరకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఇండియా కోసమే పని చేసిన ఓ రా ఏజెంట్ ఇక తట్టుకోలేక ఇండియాకి వ్యక్తిరేకంగా మారితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో వస్తున్న టైగర్3 లో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) స్పెషల్ గెస్ట్ రోల్ లో…

నటించబోతున్నాడు. సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు సాలిడ్ గా ఉండగా ఇప్పుడు రిలీజ్ అయిన టీసర్ చూస్తూ ఉంటే బాలీవుడ్ కి మరో 500 కోట్ల సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమా దీపావళికి భారీ లెవల్ లో రిలీజ్ కాబోతుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here