వరల్డ్ లోనే బిగ్గెస్ట్ కామిక్ మూవీస్ విషయం లో ఎప్పటికీ పోటి పడే ఫ్రాంచేజ్ లు, మార్వేల్ మరియి DC…మార్వేల్ వాళ్లకి అవెంజర్స్ ఎలా ఉందో, DC వాళ్లకి జస్టిస్ లీగ్ మూవీ ఉంది కానీ ఆ సినిమా 2017 లో ఆడియన్స్ ముందుకు వచ్చినా కూడా అంచనాలను అందుకోలేక పోయింది, కానీ తర్వాత తెలిసింది, ముందు ఆ సినిమా డైరెక్టర్ అనుకున్న వర్షన్ ఒకటి, కానీ రిలీజ్ చేసిన వర్షన్ మరొకటి అని…
దాంతో ఆ వర్షన్ ని ఎట్టి పరిస్థితులలో కూడా రిలీజ్ చేయాలి అంటూ DC ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కాలం ట్రెండ్ చేయగా డైరెక్టర్ స్నైడర్ ఆ రిక్వెస్ట్ ని మన్నించి తాను కట్ చేసిన ఈ సినిమాను ఎడిట్ చేసి ఎట్టకేలకు రీసెంట్ గా ఫ్యాన్స్ ముందుకు తీసుకు వచ్చాడు.
4 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జస్టిస్ లీగ్ మూవీ లెంత్ 2 గంటల రేంజ్ లో ఉండగా ఇప్పుడు రిలీజ్ అయిన స్నైడర్ కట్ జస్టిస్ లీగ్ లెంత్ 4 గంటల వరకు ఉంది, అయితేనేం ఆల్ ఓవర్ వరల్డ్ లో ఈ సినిమాను డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయగా అల్టిమేట్ రెస్పాన్స్ ను…
సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జస్టిస్ లీగ్ కన్నా కూడా ఎంతో బాగుంది అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇండియా లో కూడా DC కి సాలిడ్ ఫ్యాన్స్ ఉండగా ఈ సినిమాను పే పెర్ వ్యూ పద్దతిలో బుక్ మై షో లో రిలీజ్ చేయగా వీకెండ్ లోనే సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది..
149 టికెట్ రేటు తో ఈ సినిమా వీకెండ్ లో 1 లక్ష కి పైగా టికెట్ సేల్స్ జరిగినట్లు సమాచారం…ప్రజెంట్ లెక్క 1 లక్షా 20 వేలకి పైగానే వచ్చింది అంటున్నారు, ఈ వ్యూస్ తో సినిమా కి కలెక్షన్స్ 1.78 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం మూవీ మాడిఫైడ్ వర్షన్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.