ఈ కరోనా ఎఫెక్ట్ తో పరిస్థితులు ఎప్పుడు చక్క దిద్దుకుంటాయో ఎవ్వరికీ ఐడియా లేకుండా పోయింది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీ ల పనులు తిరిగి మొదలు అయినా సినిమా ఇండస్ట్రీ పనులు చాలా లేట్ గా కష్టంగా మొదలు అయ్యాయి. ఇక సినిమా ల రిలీజ్ లు అయితే ఆగిపోయి ఆల్ రెడీ 100 రోజుల సమయం గడిచి పోయింది, ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది అన్నది కూడా ఎవ్వరికీ క్లారిటీ లేదు.
ఇలాంటి టైం లో చాలా సినిమా లు థియేటర్ రిలీజ్ ను మర్చి పోయి మంచి రేటు ఆఫర్ వచ్చిన వెంటనే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమా లు ఈ లిస్టులో ఎంటర్ అవ్వగా కొన్ని సినిమాలు మాత్రం అలా చేయలేదు.
వాటి లో ముఖ్యంగా అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా అలాగే రణవీర్ సింగ్ నటించిన 83 వరల్డ్ కప్ సినిమా లు రెండూ ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లోనే రిలీజ్ అని కన్ఫాం చేయగా, మరో అడుగు ముందుకేసి రెండు సినిమా ల రిలీజ్ డేట్లు కూడా కన్ఫాం చేసి షాక్ ఇచ్చారు.
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేవు కానీ పరిస్థితి ఇయర్ ఎండ్ కి సద్దుకుంటుంది అన్న నమ్మకంతో అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమా ను ఈ ఇయర్ దీపావళి కి రిలీజ్ చేయబోతున్నామని అలాగే రణవీర్ సింగ్ 83 వరల్డ్ కప్ సినిమా ను ఈ ఇయర్ క్రిస్టమస్ కి రిలీజ్ చేస్తామని కన్ఫాం చేశారు నిర్మాతలు.
దాంతో అందరూ ఈ రెండు సినిమాల మీద ఉన్న కాన్ఫిడెంట్స్ తో ఇదే నిజం అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఇక మిగిలిన సినిమా లు చాలా వరకు కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ నే కన్ఫాం చేసుకుంటాయి. పరిస్థితిలు ఇయర్ ఎండ్ కి కూడా సెట్ కాక పొతే కనుక ఈ సినిమా లు అప్పుడు డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు…