Home గాసిప్స్ నారప్ప తర్వాత వెంకీ కొత్త సినిమా డైరెక్టర్ ఈయనే!!

నారప్ప తర్వాత వెంకీ కొత్త సినిమా డైరెక్టర్ ఈయనే!!

0

టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఇప్పుడు వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరో విక్టరీ వెంకటేష్. రీసెంట్ టైం లో చేసింది మల్టీ స్టారర్ మూవీసే అయినా కానీ వాటి క్రెడిట్ ఎక్కువ శాతం వెంకీ ఖాతాలో కే వెళ్ళింది అని చెప్పాలి. ఎఫ్ 2 కానీ వెంకీ మామ కానీ రెండూ అంచనాలను మించి వసూళ్లు సాధించాయి అంటే వెంకీ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఆదరణ అనే చెప్పాలి.

అంతకుముందు కూడా ఇదే ఆదరణ ఉండేది కానీ పెర్ఫెక్ట్ సినిమా పడలేదు… ఇప్పుడు ఫ్యామిలీ మూవీస్ తో మళ్ళీ జోరు పెంచిన వెంకీ ఇప్పుడు ఫ్యామిలీ మూవీ కాకుండా వైలెన్స్ ఎక్కువగా ఉండే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన..

ధనుష్ నటించిన అసురన్ తెలుగు రీమేక్ నారప్ప. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా.. లైనప్ లో కొంతమంది డైరెక్టర్స్ ఉన్నా కానీ అందరికీ షాక్ ఇస్తూ…

సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వెంకటేష్ అప్ కమింగ్ మూవీ ఉండబోతుందని ఇండస్ట్రీ లో వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. వీళ్ళ కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా అనుకున్నారు కానీ అప్పుడు కుదరలేదు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా తెర పైకి రావడానికి సిద్ధం అవుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య తో కలిసి…

లవ్ స్టొరీ తీస్తుండగా ఈ ఇయర్ ఎండ్ లో కానీ సంక్రాంతి కి గాని ఆ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది, ఇక నారప్ప కూడా అప్పుడే రాబోతుండగా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఫ్యామిలీ మూవీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఫాక్షన్ మూవీ మళ్ళీ తర్వాత ఫ్యామిలీ మూవీ తో వెంకీ పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకు పోతున్నాడు అని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here